అమ్మఒడి పథకంలో మరో మెలిక ఉందా..?

 న్యూస్ ఇండియా 24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్…  అమ్మఒడి పథకంలో మరో మెలిక ఉందా..? దేశంలో నిరక్షరాస్యత 23శాతం ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో 33శాతంగా ఉందని ప్రభుత్వం తెలిపింది. ప్రతి ఇంట్లో పిల్లలు చదువుకోవాలనే ఉద్దేశంతోనే అమ్మఒడి పథకం తీసుకువచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. అమ్మఒడి పథకంలో ఎలాంటి అపోహలు లేవని..బిడ్డను బడికి పంపిన ప్రతి తల్లికి డబ్బులు చేరవేస్తామని స్పష్టం చేసింది. ప్రభుత్వ బడులను కూడా మెరుగుపరిచేందుకు సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారని స్పష్టత ఇచ్చింది. ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇక అమ్మఒడి పథకం అమలుకు ప్రతి తల్లికీ తెల్లరేషన్ కార్డు కలిగి ఉండాలి. అయితే పాదయాత్ర సందర్భంగా పిల్లలను స్కూలుకు పంపిన ప్రతితల్లికీ అమ్మఒడి పథకం ద్వారా రూ. 15వేలు డబ్బులు ఇస్తామని నాటి ప్రతిపక్షనేతగా జగన్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చారు. అయితే కేవలం తెల్లరేషన్ కార్డు ఉన్న తల్లికి మాత్రమే పథకం అమలు చేస్తారా లేదా తమ పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికీ అమలు చేస్తారా అనేదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

 
సీతారామన్న దొర.,
ఎడిటర్-ఇన్-చీఫ్

 

Related posts

Leave a Comment