పేదవాడి నాణ్యమైన చికిత్సకు ఎందుకు మంగళం పాడుతున్నారు?: దేవినేని ఉమ

Devineni Uma, Telugudesam, YSRCP, cm releaf funds

ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్‌ఎఫ్‌) స్ఫూర్తిని వైసీపీ ప్రభుత్వం నీరు గారుస్తోందంటూ ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఓ కథనాన్ని పోస్ట్ చేస్తూ టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. సీఎంఆర్‌ఎఫ్‌కు ప్రతి నెలా దాతల నుంచి విరాళాల రూపంలో రూ.25-30 కోట్ల వరకూ వస్తుందని ఆంధ్రజ్యోతిలో పేర్కొన్నారు. ఇక ప్రభుత్వం సీఎంఆర్‌ఎఫ్‌ను నిర్వీర్యం చేసే ఉద్దేశంతోనే ఆరోగ్యశ్రీతో లింక్‌ పెట్టిందని చెప్పారు. సీఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తులు తగ్గించడం వల్ల విరాళాలు కూడా చాలావరకూ తగ్గిపోతాయని పేర్కొన్నారు. వీటిని ప్రస్తావిస్తూ జగన్ సర్కారుని దేవినేని ఉమ నిలదీశారు. ‘వైసీపీ అధికారంలోకొచ్చిన నాటినుండే సీఎంఆర్‌ఎఫ్‌కు గ్రహణం.. సిఫార్సులు పంపొద్దన్న సర్కార్. 2,434 శస్త్రచికిత్సలకు వర్తించని సాయం. ప్రతిఒక్క సిఫార్సుకు ఇచ్చినా నెలకు రూ.25 కోట్లే, ప్రతినెలా దాతల విరాళాలు 25 నుంచి 30 కోట్ల రూపాయలు. అయినా పేదవాడి నాణ్యమైన చికిత్సకు…

Read More

వైసీపీలోకి గంటా చేరికపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

వైసీపీలోకి రావాలనుకుంటే పదవికి రాజీనామా చేయాలి ఇది వైసీపీ సిద్ధాంతం పార్టీ ఆశయాలకు అనుగుణంగా జగన్ నిర్ణయం తీసుకుంటారు టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన వైసీపీ గూటికి చేరడానికి ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో చేరాలనుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలంటూ విజయసాయి అన్నారు. వ్యక్తుల కోసం తమ పార్టీ సిద్ధాంతాలను మార్చలేమని అన్నారు. వైసీపీలోకి ఎవరైనా రావాలనుకుంటే ముందుగా రాజీనామా చేయాలనేది పార్టీ సిద్ధాంతమని విజయసాయి చెప్పారు. జగన్ సుపరిపాలనను చూసి వైసీపీలో చేరేందుకు పలువురు ఎమ్మెల్యేలు సుముఖంగా ఉన్నారని అన్నారు. అయితే పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. విజయసాయి వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీలో చర్చనీయాంశంగా మారాయి. గంటా చేరికను విజయసాయి తొలి నుంచీ వ్యతిరేకిస్తున్నారంటూ వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. Tags: Vijayasai Reddy, Jagan YSRCP, Ganta Srinivasa Rao, Telugudesam

వైసీపీలోకి రావాలనుకుంటే పదవికి రాజీనామా చేయాలి ఇది వైసీపీ సిద్ధాంతం పార్టీ ఆశయాలకు అనుగుణంగా జగన్ నిర్ణయం తీసుకుంటారు టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన వైసీపీ గూటికి చేరడానికి ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో చేరాలనుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలంటూ విజయసాయి అన్నారు. వ్యక్తుల కోసం తమ పార్టీ సిద్ధాంతాలను మార్చలేమని అన్నారు. వైసీపీలోకి ఎవరైనా రావాలనుకుంటే ముందుగా రాజీనామా చేయాలనేది పార్టీ సిద్ధాంతమని విజయసాయి చెప్పారు. జగన్ సుపరిపాలనను చూసి వైసీపీలో చేరేందుకు పలువురు ఎమ్మెల్యేలు సుముఖంగా ఉన్నారని అన్నారు. అయితే పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. విజయసాయి వ్యాఖ్యలు…

Read More