నడకుదురులో వ్యభిచార గృహం పై పోలీసుల ఆకస్మిక దాడి

న్యూస్ ఇండియా 24/7నేషనల్ న్యూస్ నెట్వర్క్….తూర్పు గోదావరి : కరప మండలం నడకుదురు లో వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై శనివారం తెల్లవారుజామున పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. కరప ఎస్‌ఐ డి.రామారావు బృందం చేపట్టిన ఈ దాడిలో ముగ్గురు విటులతో పాటు ఈ గృహాన్ని నిర్వహిస్తున్న మరో మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో పట్టుబడ్డ ముగ్గురు మహిళలను బాధితులుగా గుర్తించి స్టేషన్‌ బెయిల్‌ పై విడుదల చేయడమే కాకుండా, వారికి కౌన్సిలింగ్‌ నిర్వహించేందుకు ఎస్సై రామారావు ఏర్పాట్లు చేస్తున్నారు. మండలంలో వ్యభిచార గృహాలపై పోలీసులు దాడి చేయడం, నిర్వాహకులు, విటులను పట్టుకోవడం ఇదే తొలిసారి.

Related posts

Leave a Comment