వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం నుంచి కేటీఆర్‌కు ఆహ్వానం

హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అరుదైన గౌరవం లభించింది. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం నుంచి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం ఆఫ్‌ ఇండియా సమావేశానికి గౌరవ అతిథిగా హాజరు కావాలని కేటీఆర్‌ను వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం ఆహ్వానించింది. సీఐఐ భాగస్వామ్యంతో అక్టోబర్‌ 3, 4 తేదీల్లో ఈ సమావేశాన్ని ఢిల్లీలో నిర్వహించనున్నారు. మేకింగ్‌ టెక్నాలజీ వర్క్స్‌ ఫర్‌ ఆల్‌ అనే నేపథ్యంతో ఈ సమావేశం కొనసాగనుంది.

Related posts

Leave a Comment