రంజాన్‌కు సిద్ధమవుతున్న పాతబస్తి…

 న్యూస్ ఇండియా 24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్,,…  హైదరాబాద్: రంజాన్ మాసంలో ఘుమఘుమలాడే హలీం తయారీ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పాతనగరంలోని శాలిబండ, సయ్యద్‌అలీ ఛబుత్రా, మదీనా, చార్మినార్ దూద్‌బౌలి తదితర ప్రాంతాల్లో రంజాన్ మాసంలో మదిని దోచే జిహ్వచాపల్యంతో తనదగ్గరికి రప్పించుకునే హలీం అమ్మకాలు జోరుగా సాగుతుంటాయి. హలీంల తయారీ కోసం బట్టీలను ఇప్పటికే సిద్ధం చేస్తున్న నిర్వాహకులు హలీంను రుచుల సమ్మేళనం చేసే డేగ్చాలను తయారు చేస్తున్నారు. పాతనగరంలోని పలు ప్రాంతాల్లో డేగ్చాలకు కలాయి పూతలను అద్దే పనులు వేగంగా సాగుతున్నాయి. కట్టెలను మండిస్తూ డేగ్చాలను వాటిపై వేడి చేస్తుంటారు. ఆహారం ఇనుప వస్తువులపై వేడి చేయడం మూలంగా పావడకుండా డేగ్చాల అంతర్భగంలో కలాయి పూత (వెండి)ను అద్దుతారు. మరోవైపు రంజాన్ సమీపిస్తున్న తరుణంలో నగరంలో చేతినిండా పనిని అందిపుచ్చుకోవడానికి ఇతర ప్రాంతాల నుంచి కార్మికులు వసల వచ్చి పనులు చేపట్టడానికి మొగ్గు చూపిస్తున్నారు.

Related posts

Leave a Comment