ప్రధానికి స్వాగతం పలకవద్దని సీఎంవో…నిర్ణయం..!!

న్యూస్ ఇండియా24/7 పొలిటికల్ న్యూస్ నెట్వర్క్...(అమరావతి)నేడు రాష్ట్రానికి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి స్వాగతం పలకవద్దని ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రులు నిర్ణయించారు. అలాగే కృష్ణపట్నం కోస్టల్‌ ఇన్‌స్టలేషన్‌ శంకుస్థాపనతోపాటు, క్రూడాయిల్‌ స్టోరేజ్‌ ఫెసిలిటీ జాతికి అంకితం కార్యక్రమానికి కూడా హాజరుకావద్దని నిర్ణయించారు. ఇదిలా ఉండగా ప్రధానమంత్రి పర్యటన కార్యక్రమ వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రప్రభుత్వం ఇవ్వలేదని సమాచారం. ఈ నేపధ్యంలోనే ప్రధాని కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సీఎంవోపాటు మంత్రులు నిర్ణయించుకున్నారు.

Related posts

Leave a Comment