తాటికల్లు…. అబ్బా భలే రుచి.. జర్మనీ ప్రొఫెసర్ రెజీనా..!!

న్యూస్ ఇండియా24/7 న్యూస్ నెట్వర్క్….గణపురం(జయశంకర్ భూపాలపల్లి): ‘తాటికల్లు గ’మ్మత్తు’గున్నది… తాగుతుంటే తాగాలనిపిస్తున్నది.. చెట్టు పానీయం చల్లచల్లగా… మత్తుమత్తుగా.. హాయిగా ఉంది’ అంటూ జర్మనీకి చెందిన ప్రొఫెసర్‌ రెజీనా రెండు దమ్ములు కల్లు లాగించారు. బుధవారం గణపురంలోని కోటగుళ్లను సందర్శించేందుకు 15మంది మిత్ర బృందంతో ఆమె వచ్చారు. దైవదర్శనం అనంతరం కోటగుళ్ల ప్రాంగణంలోని శిల్పాలను పరిశీలించారు. పక్కనే తాటిచెట్టుపై నుంచి కల్లును తీస్తున్న మార్క జంపాలు గౌడ్‌ వద్దకు వెళ్లారు. తెల్లగా ఉన్న ఈ పానీయం ఏమిటంటూ ప్రశ్నించింది. ఇది కల్లు అని.. తాగితే మత్తుగా ఉంటుందని జంపాలుగౌడ్‌ చెప్పగా.. తాటాకులో కల్లు తాగుతూ రెజీనా హుషారెత్తారు.

Related posts

Leave a Comment