పోలీసులు ఓడారు…. కోడి గెలిచింది.!!

న్యూస్ ఇండియా 24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్….అసలే మైదాన ప్రాంతం..అందునా అమాయక గిరిజనులు … రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి వారిది..ఇకా విషయానికి వస్తే తూర్పు గోదావరి జిల్లా మారెడుమిల్లి మండలానికి చెందిన గురమామిడి పంచాయతీ పరిధిలో మండల ప్రజా పరిషత్ పాఠశాల ఎదురుగా కోడి పందాలు మంగళవారం జోరుగా సాగాయి. కోడి పందాల జూదాలు విచ్చలవిడిగా నడుపుతూ లక్షలాది రూపాయలు అమాయకగిరిజనులు పోగొట్టుకున్న దాఖలాలు కనబడ్డాయి ,కోడి పందాలే కాకుండా గుండాట, పేకాట, తదితర జూద క్రీడలు యథేచ్చగా జరిగాయి. వీటిని నిలువరించాల్సిన పోలీసులు అటు వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం. కత్తులు కట్టే వ్యక్తులపైన, కొందరు నిర్వాహకులపైన బైండోవర్‌ కేసులు నమోదు చేశారు. 144 సెక్షన్‌ విధించారు. పోలీసులతోపాటు రెవెన్యూ యంత్రాంగం కదిలింది. అన్ని గ్రామాల్లో పందేలు జరిగే ప్రాంతాల్లో ముందస్తు నిఘాను పెట్టారు. అందరూ ఇక జరగవని దాదాపు అనుకున్నారు. అప్పటివరకు హడావుడి చేసిన పోలీసులు, రెవెన్యూ అధికారుల జాడ ఒక్కసారిగా కనిపించలేదు. చరవాణులు మూగబోయాయి. ఇక కోడిపందేలు, జూదాలు విచ్చలవిడిగా సాగాయి. ఈ కోడి పందాల్లో లక్షలాది రూపాయలు వరకు చేతులు మారాయి.

  న్యూస్ ఇండియా …ప్రతినిధి పందాల విషయమై ప్రశ్నించగా వారి సమాధానం ఈ క్రింది విధంగా ఉంది.  మాకు పోలీసు అధికారుల అనుమతి ఉంది మేమంతా అధికారులకు లక్షల్లో డబ్బులు ఇచ్చాము మీరు ఏం చేస్తారు అంటూ దురుసుగా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు బరుల నిర్వాహకులు. ముక్కున వేలువేసుకునే పరిస్థితి ఏర్పడింది. సుప్రీంకోర్టు విధించిన నిబంధనకు విరుద్ధంగా కత్తులు కట్టి కోడి పందాలు నిర్వహిస్తున్నారు. సంప్రదాయం ముసుగులో  అమాయక గిరిజనులను మోసగిస్తూ గిరిజనేతరులు …కొంత మంది గిరిజన పెద్దలకు డబ్బు ఆశ చూపి దగ్గరుండి మరీ పందాలు నిర్వహిస్తున్నారు. అధిక సంఖ్యలో పందెపురాయుళ్లు పాల్గొన్నారు. ఎక్కువ మొత్తంలో నగదు చేతులు మారాయి. తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో  తెలుగుదేశం పార్టీని స్థాపించిన మాజీ ముఖ్యమంత్రి  నందమూరి తారక రామారావు  గిరిజనుల అభ్యున్నతికి  తోడ్పడే విధంగా 1986 సంవత్సరంలో జీడిమామిడి తోటల పెంపకానికి ఎంతో కృషి చేశారు. పోడు వ్యవసాయం గాను, అడవులను చదువు చేసుకుని జీడి మామిడి తోటలు పెంచుకుంటూ పాడి పశువులతో గిరిజనులు జీవనోపాధి పొంది ఆర్థికంగా  నిలబడుతున్నతరుణంలో కోడిపందాలు జూదంకు అలవాటుపడి  అమాయక గిరిజనులు లక్షలు పోగొట్టుకుని అప్పుల ఊబిలో పడుతున్నారు, చేతి వాటానికి అలవాటుపడ్డ పోలీసులు వారికి సహకరిస్తున్నారని కొంత మంది గిరిజనులు వాపోయారు. ఇకపోతే బరుల వద్ద సారాయి, బ్రాందీ దుకాణాలు వెలిసాయి. ఎందరో అమాయక గిరిజనుల జీవితాలు చిద్రమయ్యాయంటూ ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు విమర్శిస్తున్నాయి. పోలీసులు ఓడారు కోడి గెలిచింది.

కోడి పందేల్లో…గిరిజనుల కుక్కుట శాస్త్రం.

కోడి పందేల్లో ప్రావీణ్యం ఉన్న వారు కుక్కుట శాస్త్రాన్ని అనుసరిస్తారు. పందెం వేసే రోజున నక్షత్రాన్ని బట్టి తారాబలం చూసి కోడి రంగు, జాతిని ఎంపిక చేసి పందేలు వేస్తారు. 13వ తేదీ భోగి సందర్భంగా గౌడ నెమలి, నెమలికి చెందిన పుంజులు, 14వ తేదీ యాసర కాకి డేగలు, కాకి నెమలిలు, పసిమగల్ల కాకులు, కాకి డేగలకు చెందిన పుంజులు, 15వ తేదీ డేగలు, ఎర్రకాకి డేగలు గెలుపొందుతాయని కోడిపందాల్లో ప్రావీణ్యం ఉన్న గిరిజనులు  చెబుతున్నారు.

పొన్నూరి కుమార్ రాఘవేంద్ర.,
స్పెషల్ కరస్పాండెంట్ (క్రైమ్).,
అమరావతి.

 

Related posts

Leave a Comment