ప్రత్యేకహోదాపై చంద్రబాబుకే క్లారిటీ లేదు : కేసీఆర్

  న్యూస్ ఇండియా 24/7 న్యూస్ నెట్వర్క్ హైదరాబాద్ : ప్రత్యేక హోదాపై ఏపీ సీఎం చంద్రబాబుకే క్లారిటీ లేదని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ విమర్శించారు. ప్రత్యేక హోదాతో వచ్చేది ఏముందని చంద్రబాబు పెద్ద పెద్ద డైలాగులు కొట్టారని ఎద్దేవా చేశారు. హోదా విషయంలో చంద్రబాబు మూర్ఖంగా మాట్లాడుతున్నారన్నారు. ఈమేరకు హైదరాబాద్ లో కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా అడిగేవాళ్లు మూర్ఖులని చంద్రబాబు అన్నారని, ఇప్పుడు ఆయనే హోదా అడుగుతున్నారని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ఆంధ్రాకు రావాలని చాలా మంది అడుగుతున్నారని, వంద శాతం ఆంధప్రదేశ్‌కు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు.

Related posts

Leave a Comment