హైదరాబాద్ లో డ్రంకెన్ డ్రైవ్ చేస్తోన్న వారిని పోలీసులు ఏ మాత్రం ఉపేక్షించడం లేదు. తాగి వాహనాలు నడుపుతోన్న వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తోన్నా భారీ సంఖ్యలో మందుబాబులు పట్టుబడుతూనే ఉన్నారు. ఈరోజు బంజారాహిల్స్, మాదాపూర్, కూకట్పల్లి ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో పట్టపగలే 42మంది పోలీసులకి పట్టుబడ్డారు. 16కార్లు, 20కిపైగా ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డవారిని కోర్టులో హాజరుపర్చనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. డ్రంకెన్ డ్రైవ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
Related posts
-
ఏపీకి మరో ఆర్థికభారం తప్పదా …?
THE NEWS INDIA NATIONAL NEWS NETWORK...ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతవుతున్న ఏపీపై ఇప్పుడు మరో అదనపు భారం పడుతోంది. రాష్ట్రంలో... -
Control of Senate at stake as Trump’s allies face Democrats
Washington, Nov 04: Control of the Senate was a razor-close proposition in Tuesday’s election as Republicans... -
US Election 2020 Live Updates: Close fight between Trump and Biden in projections
THE NEWS INDIA NATIONAL NEWS NETWORK…. Washington, Nov 04: The first round of poll closures began on...