రాజమాత ప్రమోదాదేవి… దక్కని బేబీ గుట్ట!!

THE NEWS INDIA(TNI 24 NEWS NETWORK)…బేబీ బెట్ట (గుట్ట) ప్రాంతంలో క్వారీల కారణంగా కృష్ణరాజసాగర్‌ రిజర్వాయరుకు ముప్పువాటిల్లే ప్రమాదం ఉందని ఒకవైపు భయాందోళనలు వ్యక్తమవుతుండగ్ఖా మరోవైపు ఈ భూమిని తన పేరుమీద పట్టా ఇవ్వాల్సిందిగా రాజమాత ప్రమోదాదేవి డిమాండు చేయడం తాజా ఘట్టం. మండ్య జిల్లాలోని ఈ భూమి బి.ఖరాబు (ప్రజోపయోగం కోసం ప్రత్యేకించినవి) భూమిగా గుర్తించినందున కేటాయింపు తన పరిధిలో లేదని పాండవపుర తహసీల్దార్‌ గురువారం స్పష్టం చేశారు. బేబీ బెట్ట ప్రాంతంలో మైసూరు చివరి రాజు జయచామరాజ ఒడెయరు పేరుతో ఉన్న 1487.27 ఎకరాల భూమిని తనకు కేటాయించాలని రాజమాత కోరుతున్నారు. బి.ఖరాబు భూమిగా గుర్తించినందున పట్టా కావాలంటే డిప్యూటీ కమిషనరు న్యాయస్థానంలో ప్రయత్నించవచ్చని తహసీల్దార్‌ హనుమంతరాయప్ప పేర్కొన్నారు. క్వారీల పేలుళ్ల కారణంగా వెలువడే శబ్దాలకు కృష్ణరాజసారగ జలాశయం భద్రతకు ప్రమాదం నెలకొందని ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. పేలుళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు. గుట్టను బి.ఖరాబు భూమిగా గుర్తించిన విషయం తనకు తెలియదని ప్రమోదాదేవి పేర్కొన్నారు. జిల్లా అధికారి మంజుశ్రీని విచారించగా భూమి కేటాయింపునకు సంబంధించి ప్రమోదాదేవి మూడుసార్లు అర్జీపెట్టుకున్నారని- డీసీ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని తాను సూచించినట్లు తెలిపారు.

మంచాల భాస్కర్ రెడ్డి,
న్యూస్ ఎడిటర్,కర్ణాటక .

 

Related posts

Leave a Comment