అటవీశాఖలో ఎర్రదొంగలు …

THE NEWS INDIA(TNI 24 NEWS NETWORK)….(RED SANDAL SPECIAL STORY)

 కంచే చేను మేస్తున్న వైనం…  
 చిల్లరకు కక్కుర్తిపడి వాహనంలో పరికరాలు మాయం..
అధికారులు సైతం అడ్డగోలు సమాధానాలు,
  కోట్లల్లో ప్రభుత్వ ఆధాయానికి తూట్లు.

చిత్తూరు జిల్లా అనగానే ప్రభుత్వానికి , అతివిలువైన ప్రధాన ఆధాయ వనరు ఎర్రచందనం. వందల కిలోమీటర్ల శేష్యాచలం కొండలు విస్తరించి ఉండటం, ప్రపంచ దేశాలలో ఎక్కడా లభించని అత్యంత విలువైన ఎర్ర చందనం చెట్లు ఇక్కడ మాత్రమే లభించడం విశేషం.ఈ వృక్ష సంపద కోసం ప్రపంచంలోని అనేక దేశాలు, అనేక అక్రమ మార్గాలలో మనదేశం నుండి దిగుమతి చేసుకుంటూ కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నాయి.అయితే ఈ అక్రమ తరలింపును అరికట్టడానికి, చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలో ప్రత్యేక దళాలను, నిరంతర పర్యవేక్షణలో అటవీ అధికారుల గస్తీలను ప్రభుత్వం ముమ్మరం చేసింది , వీరికి అన్ని రకాల సదుపాయాలు సమకూరుస్తూ కోట్లాది రూపాయలు జీతాలు ఇస్తున్న వీరు చేతివాటం తప్పటం లేదు.

        ప్రతి నిత్యం ఈ మూడు జిల్లాలో పదుల సంఖ్యలో ఎర్ర దొంగలను పట్టుకుంటు, కేసులు, నమోదు చేస్తుంటారు. వారి నుండి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం ఆయా జిల్లా గిడ్డంగులకు తరలించిగా, పట్టుబడిన వాహనాలను ఆ పరిధిలోని అటవీ శాఖ కార్యాలయాలలో సీజ్ చేసి భద్రపరుస్తారు.
    అయితే ఇక్కడి నుండే ఆయా అటవీ శాఖ సిబ్బంది, అధికారులు వారి చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. సీజ్ చేసిన వాహనాలలో, వీరికి అవసరమైనప్పుడు, అవసరాలకు తగినట్టు, విందులు, విలాసాల పార్టీలకు వాహనాలు లోని విడిభాగాలను విక్రయించి వచ్చిన సొమ్ముతో జల్సాలకు పాల్పడుతున్నారని విశ్వాసనీయ సమాచారం. వాహనాన్ని సీజ్ చేసినపుడు సక్రమంగా పనిచేస్తున్న వాహనం,వీరి ఆధీనంలోకి వచ్చిన తరువాత అగమ్యగోచరంగా తయారవుతుంది.వాహనంలోని వేల రూపాయలు ఖరీదు చేసే విడి భాగాలు,తక్కువ ధరకు అమ్మి విలాసాలకు పాల్పడుతున్నరని స్థానికులు వాపోతున్నారు.
 సీజ్ చేసిన వాహనాలు అటవీ కార్యాలయానికి రాగానే స్థానికంగా కొంత మంది మెకానిక్ షాపులకు, బ్రోకర్లకు సమాచారం చేరిపోతుంది. వెంటనే అక్కడికి చేరుకొని అవసరమైన భాగాలను బేరసారాలు నడుమ తీసుకుపోయి సొమ్ము చేసుకుంటున్నారు .ఇక్కడికి చేరిన మోటారు సైకిల్, లారీలు, కార్ల ఇంజిన్లు, కార్ల సీట్లు,  స్టీరింగ్, భ్యాటరీలు, లైట్లు, చక్రాలు, లారీలకు ఏకంగా ఇంజిన్లను సైతం వేటిని వదిలి పెట్టరు. వీటి గురించి ఏ ఉన్నత అధికారి పట్టించుకోరు.కారణం కిందిస్థాయి అధికారి నుండి పై స్థాయి అధికారుల వరకు మామ్ముల్లు తూచాతప్పకుండా వారి వారికి అందిపోతుంటాయి.అటవీశాఖ అధికారులను ఈ వాహనం ఎందుకు ఇలా ఉంది అని ప్రశ్నిస్తే… వారు చెప్పిన సమాధానం  విస్మయానికి గురిచేస్తాయి. కారుకు చక్రాలు లేవు, స్టీరింగ్ లేదు… ఏమైంది అని అడిగితె “ఇవి అన్ని ఇది వరకే ఇలాగే ఉన్నాయి.” అని సమాధానం ఇవ్వటం విడ్డూరంగాఉంది.
    ఇలా సీజ్ చేసిన వాహనాలను సంవత్సరానికి ఒక్కసారి వేలం వేయటం ఆనవాయితి.అయితే అరకొరగా ఉన్న వాహనాలను చూసి వేలానికి వచ్చిన వారు.. సదరు వాహనాలను కొనటానికి ముందుకు రావటం లేదు. దాంతో ఆ వాహనాలు శిథిలావస్థకు చేరుకొని, తుప్పు పడుతూ, కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి భారీగా ఘండి కొడుతున్నారు.ఇప్పటికే ఆయా కార్యాలయాలలో వేల సంఖ్యలో వాహనాలు మూలనపడి వందల కోట్లుకు సమానమైన సంపదకు చెద, తుప్పు పట్టి మూలుగుతున్నాయి. ఇప్పటికైనా సదరు అటవీ శాఖ మంత్రి ,అధికారులు స్పందించి…ఇటువంటి స్వల్ప, స్వార్ధ ప్రయోజనాలను పక్కనపెట్టి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కాపాడుదాం అనుకుంటారో,లేక నీకెంత… నాకెంత అంటు వాటాలు పంచుకొని జేబులు నింపుకుంటారో వేచి చూద్ధాం.
,
 శ్రీనివాసుల అరవింద రెడ్డి
రాయలసీమ జోన్ బ్యూరో చీఫ్.

Related posts

Leave a Comment