బైక్ మీద నుంచి పడిపోయిన తల్లిదండ్రులు.. 300 మీటర్లు బైక్ పైనే పోయిన చిన్నారి.. వీడియో చూడండి!

తమ ముందు వెళ్తున్న బైక్ ను ఢీకొట్టిన తండ్రి
తల్లిదండ్రులు కింద పడిపోయినా బైక్ తో పాటే వెళ్లిన చిన్నారి
డివైడర్ మీదున్న గడ్డిలో పడి, సురక్షితంగా బయటపడ్డ చిన్నారి
ఇది నిజంగా మహాద్భుతం. చూస్తే కానీ నమ్మలేం. ఘోర రోడ్డు ప్రమాదం నుంచి ఓ చిన్నారి సురక్షితంగా బయటపడిన వైనం. వివరాల్లోకి వెళ్తే, చన్నపరమేశ్వర్, రేణుక దంపతులు తమ ఐదేళ్ల చిన్నారితో కలసి బేగూరు నుంచి బెంగుళూరుకు బైక్ పై వెళ్తున్నారు. వారికి ముందుగా వెళ్తున్న బైక్ ను చిన్నారి తండ్రి వేగంగా ఢీకొట్టాడు.

ఈ ఘటనలో దంపతులిద్దరూ బైక్ పై నుంచి కిందకు పడిపోయారు. కానీ, వారి బైక్ మాత్రం కిందపడలేదు. ముందు కూర్చున్న చిన్నారితో పాటు దాదాపు 300 మీటర్ల దూరం ప్రయాణించింది. ఆ తర్వాత వేగం తగ్గిన బైక్, రోడ్డుకు పక్కన ఉన్న డివైడర్ ను ఢీకొంది. దీంతో, ఆ చిన్నారి పక్కన ఉన్న గడ్డిలో పడి, సుక్షితంగా బయట పడింది.

ఈ మొత్తం ఘటన వెనుకనే వస్తున్న ఓ కారు కెమెరాలో రికార్డ్ అయింది. ఆదివారం సాయంత్రం బెంగుళూరు రూరల్ లోని నేలమంగళ ప్రాతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దంపతులిద్దరికీ ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలయ్యాయి. ఈ వీడియోను ఓ పోలీసు ట్విట్టర్ లో షేర్ చేశారు.

Related posts

Leave a Comment