ఎన్నికలలో డబ్బు ఖర్చు- చంద్రబాబు వ్యాఖ్య

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలలో డబ్బు ఖర్చు పెట్టరాదని చెబుతున్నారు.ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ వైఎస్ హయాంలో ఎమ్మెల్యేలు,ఎమ్.పిలు విచ్చలవిడిగా సంపాదించారని ఆరోపించారు.’ అదే సమయంలో మా వాళ్లను కట్టడి చేస్తే.. చూడండి వారు ఎలా చేస్తున్నారో అని తిరిగి నన్ను ప్రశ్నించేవారు. ఎన్నికల విధానంలో డబ్బు ప్రభావం లేకుండా చేయాలి. డబ్బులు లేకపోయినా ఎన్నికల్లో గెలవగలగాలి. దాని కోసం రూ.500, రూ.2000 నోట్లను రద్దు చేయాలి. అలా చేస్తే రూ.100, రూ.200 నోట్లను మోసుకెళ్లడం చాలా కష్టం. ఎన్నికల నిర్వహణ సమయాన్ని 14 రోజుల నుంచి 10 రోజులకు తగ్గించాలి. ప్రజాసేవ చేసినందుకు నాయకుడికి గౌరవం ఉండాలి. ఎవరో ఒకరు అప్పటివరకూ ఏదోపని చేసుకుని ఎన్నికల ముందు డబ్బు సంచిలతో వచ్చి ఎమ్మెల్యే అనే గుర్తింపు కోసం రాజకీయాల్లోకి రావాలనుకోవడం సరికాదు.నిజంగానే చంద్రబాబు ఎన్నికలలో డబ్బు ఖర్చుపెట్టడం లేదా?నంద్యాలలో ఆయన చేసిన కోట్ల ఖర్చుమాటేమిటి?

Related posts

Leave a Comment