ఒబామాతో డిన్నర్ చేస్తే బిల్లు రూ. 400 మాత్రమే!

అమెరికా అధ్యక్షుడితో డిన్నర్ చేయాలంటే… ఏదైనా చారిటీ కోసం ఆయనతో డిన్నర్ చేసే అవకాశం అప్పుడప్పుడూ లభిస్తుంది. ఇందుకు వేల నుంచి లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వుంటుంది. ఇక ఆయన వియత్నాం పర్యటనలో భాగంగా, సీఎన్ఎన్ రిపోర్టర్ ఆంథోనీ బౌర్డియాన్ తో కలిసి హనోయిలోని ఓ రోడ్ సైడ్ రెస్టారెంట్ కు వెళ్లి బీరు తాగి, నూడిల్స్, సూప్, గ్రిల్డ్ పోర్క్ తదితరాలను తీసుకోగా, బిల్లు ఆరు డాలర్లు (సుమారు రూ. 400) అయిందట. తామిద్దరమూ కలిసి డిన్నర్ చేస్తూ మాట్లాడుకోగా బిల్లు చాలా తక్కువ వచ్చిందని, అక్కడ అమెరికా అధ్యక్షుడు ఉన్నారన్న ఆలోచన కూడా లేకుండా చుట్టుపక్కల వారు తమ పని తాము చేసుకు వెళ్లారని ఆంథోనీ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. ఒబామా బీర్ తాగుతున్న ఫోటోను పోస్ట్ చేశారు. ఓ సాధారణ వ్యక్తిలా కనీసం బ్యాక్ రెస్ట్ కూడా లేని నీలిరంగు ప్లాస్టిక్ స్టూల్ పై కూర్చుని డిన్నర్ చేస్తున్న ఒబామా చిత్రాన్ని మీరూ చూడవచ్చు.

Related posts

Leave a Comment