భార్యకు అసభ్యకరపోస్టులు.. ఆకతాయిని చితకబాదిన ఐఏఎస్

   న్యూస్ ఇండియా24/7 క్రైమ్ న్యూస్ నెట్వర్క్ …అసభ్యకర పోస్టులతో తన భార్యు వేధిస్తున్న ఓ యువకుడిని పోలీస్ స్టేషన్‌లోనే చితకబాదాడు ఓ ఐఏఎస్ అధికారి. వివరాల్లోకి వెళితే.. పశ్చిమబెంగాల్‌ అలీపూర్‌ద్వార్ జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి నిఖిల్ నిర్మల్‌ అదే ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తూ తన భార్యతో కలిసి అక్కడే నివసిస్తున్నారు. ఈ క్రమంలో అతని భార్యకు ఓ వ్యక్తి నుంచి అసభ్యకర మేసేజ్ వచ్చింది. తొలుత దీనిని పట్టించుకోనప్పటికీ ఆ తర్వాత అవి మరింత ఎక్కువ కావడంతో నిఖిల్ దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వినోద్ కుమార్ సర్కార్ అనే యువకుడిని అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న నిఖిల్ ఆదివారం తన భార్యను తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. యువకుడిని చూడగానే కోపంతో ఊగిపోయారు.. ఆవేశంతో అతనిని చితకబాదారు..…

Read More

మళ్లీ స్వైన్‌ ఫ్లూ పంజా…

న్యూస్ ఇండియా న్యూస్ నెట్వర్క్… మళ్లీ స్వైన్‌ ఫ్లూ పంజా విసురుతోంది. గత రెండు వారాలుగా చలి తీవ్రత విపరీతంగా పెరగడంతో స్వైన్‌ ఫ్లూ వైరస్‌ అంతకంతకు విస్తరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఫ్లూ లక్షణాలతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో మరోసారి జనంలో ఆందోళన వ్యక్తమవుతోంది. చలి తీవ్రత పెరగడంతో మళ్లీ స్వైన్‌ ఫ్లూ ఘంటికలు మోగుతున్నాయి. తాజాగా గాంధీ ఆస్పత్రిలో ఎన్‌-1 హెచ్‌-1 వైరస్‌లో ముగ్గురు చేరడం కలకలం రేపుతోంది. వీరిలో సిద్ధిపేటకు చెందిన ఒక వ్యక్తి, ఉప్పల్‌లో నివసించే ఓ యువతి, ఆల్వాల్‌కు చెందిన మరొకరు స్వైన్‌ ఫ్లూతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ముగ్గురికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయ్యిందని గాంధీ డాక్టర్లు ధృవీకరిస్తున్నారు. అటు ఉస్మానియాలో ఆస్పత్రిలో మరో ఇద్దరు ఫ్లూ లక్షణాలతో చేరారు. ఇప్పటికే ఎంతో మంది స్వైన్‌…

Read More

ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. మహిళ మృతి

న్యూస్ ఇండియా క్రైమ్24/7 న్యూస్ నెట్వర్క్.. మద్యం మత్తులో కారును నడిపి, ఇంట్లోకి కారు దూసుకెళ్లడంతో ఓ మహిళ మరణించింది. ఈ ఘటన హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. టోలిచౌకీలో నివాసముండే మహ్మద్ ఇక్రమ్ అలీ ఓ కాల్ సెంటర్ లో పనిచేస్తూ ఇటీవలే ఉద్యోగం మానేశాడు. బార్కాస్ లో జరిగిన పార్టీలో స్నేహితులతో కలిసి పీకలదాకా మద్యం తాగాడు. మద్యం మత్తులో ఇంటికి బయలు దేరాడు. దారితప్పి గచ్చిబౌలీ, గౌలిదొడ్డి మీదుగా అతివేగంగా గొపన్ పల్లి వైపు వెళ్లాడు. గౌలిదొడ్డిలోని ప్రభుత్వ పాఠశాల వద్ద కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా సమీపంలోని ఇంట్లోకి దూసుకెళ్లింది. గోడలు పూర్తిగా ధ్వంసం కావడంతో ఇంట్లోని మధుబాయ్ అనే మహిళ తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించింది. నిందితుడు ఇక్రమ్…

Read More

మకర సంక్రాంతి భావమేమిటో తెలుసా..!!

న్యూస్ ఇండియా భక్తి న్యూస్ నెట్వర్క్…ఉత్తరాయణ పుణ్యదినమైన మకర సంక్రాంతి అంటేనే డూడూ బసవన్నలు, హరిదాసుల పాటలు మనకందరికీ గుర్తుకు వచ్చేస్తుంటాయి. అయితే మకర సంక్రాంతి అనేది సౌర కుటుంబంలో సూర్యుడు మనిషిని ప్రభావితం చేసే ఒక ప్రధానమైన అంశమేని, అందుకే సూర్యునికి సంబంధించిన ఈ పండుగను ప్రజలు ఎంతో విశేషంగా జరుపుకుంటారు. ఆకాశం గాలి పటాల చుక్కలపరుచుకున్నప్పుడు.. భూమి రంగు రంగుల రంగవల్లుల అల్లికలతో వైభవోపేతమైన అందాన్ని సమకూర్చుకుంటుంది. పట్టణమైనా, పల్లెలైనా, సంక్రాంతి శోభ పరచుకుంటాయి. తెలుగు వారికి పుష్య మాసంలో (జనవరి – ఫిబ్రవరి నెలల్లో) వచ్చే అత్యంత ముఖ్యమైన పండుగ – సంక్రాంతి. నాలుగు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగ తొలి రోజు భోగీ, రెండో రోజు మకర సంక్రాంతి, మూడో రోజు కనుమ, నాలుగున ముక్కనుమగా జరుపుకుంటారు. సంక్రాంతి నుండి ఉత్తరాయన…

Read More