మీడియా అధిపతులు శత్రువులయ్యారు: కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

న్యూస్ ఇండియా పొలిటికల్ న్యూస్…రెండు మీడియా సంస్థల అధిపతులు, చంద్రబాబు, లగడపాటి కలసి టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్న సర్వే ఫలితాలను మార్చివేశారని కేటీఆర్ ఆరోపించారు. కొన్ని దినపత్రికలు రంగును మార్చుకున్నాయని, తమకు మిత్రులు ఎవరో, శత్రువులు ఎవరో తెలిసిపోయిందని అన్నారు. 11వ తేదీన ఫలితాలు వెల్లడైన తరువాత ఆ ఇద్దరు మీడియా అధిపతుల పేర్లనూ తాను వెల్లడిస్తానని అన్నారు. నవంబర్ 20 తరువాత సర్వే చేయలేదని లగడపాటి రాజగోపాల్ స్వయంగా అంగీకరించారన్న విషయాన్ని గుర్తు చేసిన కేటీఆర్, మరి ఫలితాలు ఎలా మారాయని ప్రశ్నించారు. అకస్మాత్తుగా న్యూస్ పేపర్లు ప్రజా కూటమికి మద్దతు పలికాయని, గతంలోనూ చంద్రబాబు టీఆర్ఎస్ ను అస్థిర పరిచే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. ఓటుకు నోటు సమయంలోనూ ఈ మీడియా సంస్థలు చంద్రబాబుకు అండగా ఉన్నాయని, 12న తాను మీట్ ది…

Read More

ఎన్‌ఐఏ దర్యాప్తుపై పరిశీలన..

ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌పై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) చేత దర్యాప్తు చేయించే విషయంపై పరిశీలన జరుగుతోందని కేంద్ర ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు నివేదించింది. ఈ ఘటన ఎన్‌ఐఏ చట్టంలో నిర్ధేశించిన నేరాల పరిధిలోకి వస్తుందో రాదో పరిశీలన చేసి, ఆ తరువాత దర్యాప్తుపై నిర్ణయం తీసుకుంటామని, అందుకు కొంత సమయం పడుతుందని వివరించింది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ఎన్‌ఐఏ దర్యాప్తుపై ఏ నిర్ణయం తీసుకున్నా బహిర్గతం చేయకుండా సీల్డ్‌ కవర్‌లో తమ ముందుంచాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ లోపు రాష్ట్ర పోలీసులు దర్యాప్తును కొనసాగించవచ్చునని తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌…

Read More

గెట్ రెడీ… పెట్రోలు ధరలు పెరిగే టైమొచ్చింది!

ఇటీవలి కాలంలో వరుసగా తగ్గుతూ వచ్చిన ధరలు ఎన్నికలు పూర్తికాగానే ధరలు పెంచే ఆలోచనలో కేంద్రం ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరుగుతున్న క్రూడాయిల్ ధర రెండు నెలలకు ముందు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్న పెట్రోలు, డీజిల్ ధరలు, ఆపై క్రమంగా తగ్గుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో, పాలకులపై ప్రజా వ్యతిరేకత పెరగకుండా చూసుకునేందుకే చమురు కంపెనీలపై ఒత్తిడి తెచ్చి, క్రమంగా ధరలను తగ్గించేలా చూశారు. దీంతో నెలన్నర వ్యవధిలోనే రూ. 10 మేరకు ధరలు తగ్గాయి. ఇక ఎన్నికలు రేపటితో ముగియనుండటంతో ఆపై తిరిగి ‘పెట్రో’ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయని చమురు రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్ యూపీ, మణిపూర్ లో ఎన్నికలు జరిగిన వేళ, జనవరి 16 నుంచి ఏప్రిల్…

Read More

ఓటేయడానికి గ్రామానికి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం

ఓటేయడానికి గ్రామానికి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం

హైదరాబాద్ నుంచి కారులో వెళ్తుండగా ప్రమాదం విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు నల్గొండ జిల్లాలో ఘటన శుక్రవారం జరగనున్న ఎన్నికల్లో ఓటు వేసేందుకు స్వగ్రామానికి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. పెద్ద అడిశర్లపల్లి మండలం పోల్కంపల్లికి చెందిన పోగుల సురేందర్‌రెడ్డి(55), పోగుల యాదమ్మ(50) భార్యభర్తలు. ఐదు రోజుల క్రితం హైదరాబాద్‌లో ఉంటున్న కుమార్తెను చూసేందుకు వచ్చారు. శుక్రవారం ఎన్నికలు జరగనుండడంతో ఓటు వేసేందుకు.. అల్లుడు వెంకట్‌రెడ్డి (35), స్నేహితుడు బొడ్డుపల్లి నర్సింహాచారి, వెంకటరెడ్డి అన్న కుమారుడు మహేందర్ రెడ్డితో కలిసి సురేందర్‌రెడ్డి, యాదమ్మలు కారులో స్వగ్రామానికి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు కొండమల్లేపల్లి మండలంలోని కేశ్యాతండా వద్ద అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని…

Read More