వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే రామ మందిర బిల్లు!

న్యూస్ ఇండియా 24/7 పొలిటికల్ డెస్క్ ….న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు బీజేపీ ఎంపీ రవీంద్ర కుశ్వారా వెల్లడించారు. ఒకవేళ ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందకపోతే కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికీ అయోధ్య కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మందిర నిర్మాణం కోసం చట్టం తీసుకురావాలని హిందుత్వ గ్రూపులు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నాయి. అయితే డిసెంబర్ 11 నుంచి ప్రారంభం కాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లు పెట్టి తీరతామని ఎంపీ కుశ్వార చెప్పడం గమనార్హం. పార్లమెంట్‌లో ఈ బిల్లుపై చర్చ జరుగుతుందని, అప్పుడే ఏ పార్టీ మందిరాన్ని కోరుకుంటున్నదో, ఏది వ్యతిరేకిస్తున్నదో తెలుస్తుందని ఆయన అన్నారు. లోక్‌సభలో కచ్చితంగా బిల్లు పాసవుతుందని,…

Read More

కాంగ్రెస్ తో కలసి వెళ్లాలన్న ఆలోచన నాదే: ఎల్.రమణ

న్యూస్ ఇండియా24/7 పొలిటికల్ డెస్క్…మేడ్చల్ లో మహాకూటమి తరపున కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సమావేశంలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఆసక్తికర ప్రసంగం చేశారు. కాంగ్రెస్ పార్టీతో కలసి ఎన్నికల బరిలోకి దిగాలనే ఆలోచన తనదేనని చెప్పారు. టీజేఎస్ అధినేత కోదండరాం, సీపీఐ నేత చాడ వెంకటరెడ్డిలతో ఎన్టీఆర్ భవన్ లో తాను ఈ ప్రతిపాదన తెచ్చానని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం కాంగ్రెస్ తో కలసి మహాకూటమిని ఏర్పాటు చేయాలని తొలుత ప్రతిపాదించింది తానేనని చెప్పారు. తెలంగాణ వస్తే దళితుడిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడతానని చెప్పిన కేసీఆర్… అధికారం రాగానే తానే సీఎం అయ్యారని రమణ మండిపడ్డారు. 51 నెలలు మాత్రమే పాలించి, అర్ధాంతరంగా ప్రభుత్వాన్ని రద్దు చేశారని ఎద్దేవా చేశారు. మళ్లీ 119 మందితో కలసి తెలంగాణ సమాజంపైకి బయలుదేరారని విమర్శించారు. నాలుగు పార్టీలు…

Read More

Rahul Gandhi Speech @ Medchal

THE NEWS INDIA)24/7 ENGLISH NEWS NETWORK)…Congress has conducted public meeting at Medchal which is attended by Sonia Gandhi and Rahul Gandhi. Rahul Gandhi addressing the meeting has stated that Sonia Gandhi stood by the people who fought for Telangana during the movement and Rahul expressed that Telangana is formed at the cost of blood and sweat of the people of Telangana. Further, Rahul Gandhi said that Soni Gandhi’s hand was also there in forming the state of Telangana. Watch the video to listen to Rahul Gandhi at Medchal meet.  

Read More

తెలంగాణ రారాజు మళ్లీ కేసీఆరే… టైమ్స్ నౌ-సీఎన్ఎక్స్ సర్వే

న్యూస్ ఇండియా పొలిటికల్ డెస్క్… కొద్ది రోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ కు పట్టం కట్టబోతున్నారని టైమ్స్ నౌ-సీఎన్ఎక్స్ ప్రీపోల్ సర్వే తెలిపింది. మొత్తం 119 స్థానాలకు గాను టీఆర్ఎస్ 70 సీట్లను కైవసం చేసుకోబోతోందని వెల్లడించింది. కాంగ్రెస్ 31, ఎంఐఎం 8, బీజేపీ 3 స్థానాల్లో గెలుస్తుందని పేర్కొంది. టీడీపీ కేవలం 2 స్థానాలకే పరిమితమవుతుందని చెప్పింది. 5 సీట్లలో ఇతరులు గెలుస్తారని తెలిపింది. 4,800 మందిని సర్వే చేయడం ద్వారా టైమ్స్ నౌ-సీఎన్ఎక్స్ ఈ ఫలితాలను వెల్లడించింది. నవంబర్ 12 నుంచి 18వ తేదీ వరకు అభిప్రాయాలను సేకరించి, క్రోడీకరించినట్టు తెలిపింది. దాదాపు 40 నియోజకవర్గాల్లో సర్వేను నిర్వహించినట్టు పేర్కొంది. ఓట్ల శాతం విషయానికి వస్తే… టీఆర్ఎస్ కు 37.55 శాతం, కాంగ్రెస్ కు 27.98, బీజేపీకి 11, టీడీపీకి…

Read More