కేసీఆర్ నిండా మునగడం ఖాయం: చంద్రబాబు

THE NEWS INDIA(TNI 24/7 NEWS NETWORK)…తెలంగాణలో జరిగే ఎన్నికల్లో మహాకూటమి గెలుపు ఖాయమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఎంతోమంది అప్రతిష్ఠకు గురైన ఎమ్మెల్యేలకు కేసీఆర్ టికెట్లు ఇచ్చారని ఆరోపించిన ఆయన, వారెవరూ గెలిచే పరిస్థితి లేదని అన్నారు. ఉండవల్లిలోని ప్రజా వేదిక భవనంలో జరిగిన టీడీపీ వ్యూహ కమిటీ సమావేశంలో తెలంగాణ ఎన్నికల అంశం ప్రస్తావనకు రాగా, చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. నిరంకుశంగా వ్యవహరిస్తూ, సామాన్యులను అవస్థల పాలు చేసిన నరేంద్ర మోదీకి, కేసీఆర్ మద్దతు పలుకుతున్నారని, ఆయన వేస్తున్న తప్పటడుగులే కొంప ముంచనున్నాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో జగన్, బీజేపీ మధ్య లోపాయకారీ ఒప్పందం నడుస్తోందని, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కూడా జగన్ చేసిన ఒత్తిడి ఫలితంగానే నిలిచిపోయిందని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ వినోద్ చెప్పారన్న విషయాన్ని…

Read More

కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని ?

THE NEWS INDIA(TNI 24/7 NEWS NETWORK)…తెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికను దాదాపు ఖరారు చేశాయి. టీఆర్ఎస్ ఓటమి కోసం గట్టిగా పోరాడుతున్న మహాకూటమి కూడా తొలి విడత జాబితాను ప్రకటించింది. కూటమిలోని టీడీపీ ఇప్పటికే కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. అయితే, తాజాగా చక్కర్లు కొడుతున్న వార్త ఒకటి ఇటు తెలంగాణలోనూ, అటు ఎన్టీఆర్ కుటుంబంలోను హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని కూకట్‌పల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దించబోతున్నట్టు వార్త ఒకటి హల్‌చల్ చేస్తోంది. మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి కుమారుడు శ్రీకాంత్ భార్యే సుహాసిని. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వద్ద కూడా  ఈ విషయం చర్చించినట్టు…

Read More

రాజధాని నిర్మాణానికి 1,09,023 కోట్లు

రాజధాని అమరావతి గ్రీన్‌ ఫీల్డ్‌ సిటీ నిర్మాణానికి ప్రాథమికంగా రూ.1,09,023 కోట్ల వ్యయమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ట్రంక్‌–1, ట్రంక్‌–2 మౌలిక వసతులతో పాటు ప్రభుత్వ కాంప్లెక్స్‌ ఇతర సదుపాయాల కల్పనకు ప్రాథమికంగా ఈ మొత్తం అవసరమని ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చింది. అయితే, కేంద్ర ప్రభుత్వానికి రూ.39,937 కోట్లతో సవివరమైన ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సమర్పించింది. రాజధానికి వచ్చే మూడేళ్లలో రూ.39,937 కోట్లు అవసరమని ఆ నివేదికలో పేర్కొంది. అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్, అసెంబ్లీ, హైకోర్టు, రాజ్‌భవన్, ముఖ్యమంత్రి, మంత్రుల బంగ్లాలు.. సచివాలయం, ప్రభుత్వ ఉద్యోగుల గృహ సముదాయాలకు ఈ మొత్తం అవసరమవుతుందని అంచనా వేసినట్లు డీపీఆర్‌లో పేర్కొంది. వచ్చే మూడేళ్లకు సంబంధించి.. తొలి ఏడాదిలో రూ.10,610 కోట్లు, రెండో ఏడాదిలో రూ.22,578 కోట్లు, మూడో ఏడాదిలో రూ.6,749 కోట్లు అవసరమని…

Read More

కాజల్ ను ముద్దు పెట్టుకోవడంపై చోటా కె నాయుడి వివరణ!

సౌందర్య తర్వాత నేను ఎక్కువ అభిమానించింది కాజల్ నే కాజల్ తో చాలా సినిమాలకు పని చేశా ఆమె పనితనాన్ని మెచ్చుకునేందుకే ముద్దు పెట్టా ‘కవచం’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో హీరోయిన్ కాజల్ ను ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు పబ్లిక్ గా ముద్దు పెట్టుకోవడం వివాదాస్పదంగా మారింది. ఆయనను ఫిలిం ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని పలువురు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, గతంలో హీరోయిన్స్ తో ఆయన అసభ్యకరంగా మాట్లాడిన పాత వీడియోలను కూడా షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఈ అంశంపై చోటా కె నాయుడు స్పందించారు. సౌందర్య తర్వాత తాను అంతగా అభిమానించింది కాజల్ నే అని ఆయన చెప్పారు. కాజల్ తో కలసి చాలా సినిమాలకు పని చేశానని… ఆమె పనితనాన్ని మెచ్చుకునేందుకే ఆమెను ముద్దు పెట్టుకున్నానని……

Read More