జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో 1,121 మంది అభ్యర్థులు

జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ పర్వం నిన్న మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. దీంతో చివరగా ‘గ్రేటర్’ బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలను ఎన్నికల అధికారులు ప్రకటించారు. మొత్తం 2,900 మందికిపైగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, స్క్రూటినీ, ఉపసంహరణ అనంతరం 1,121 మంది అభ్యర్థులు పోటీలో నిలిచినట్టు అధికారులు తెలిపారు. అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దాదాపుగా మొత్తం 150 డివిజన్లలోనూ తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి. టీడీపీ నుంచి 105 మంది, ఎంఐఎం నుంచి 50 మంది పోటీలో ఉండగా, ఇతర పార్టీలు, స్వతంత్రులు 500 మందికిపైగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
Tags: GHMC Elections, Hyderabad, TRS Congress, BJP TDP

ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ యాప్‌లు నిషేధించండి: కేంద్రమంత్రికి సీఎం జగన్ లేఖ

ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ వెబ్‌సైట్లు, యాప్‌లను నిషేధించాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు లేఖ రాశారు. యువత వీటికి బానిసలుగా మారుతున్నారని, ఆర్థికంగా చితికిపోతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

వీటి బారినపడి డబ్బులు నష్టపోయిన వ్యక్తులు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నట్టు పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్‌లు, గ్యాంబ్లింగ్‌పై ఉక్కుపాదం మోపేందుకు 1974 ఏపీ గేమింగ్ చట్టంలో సవరణలు కూడా తీసుకొచ్చినట్టు ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో మొత్తం 132 వెబ్‌సైట్లు గ్యాంబ్లింగ్, బెట్టింగుకు కారణమవుతున్నాయని, వాటిని నిషేధించాలని కోరుతూ వాటి వివరాలను ముఖ్యమంత్రి తన లేఖకు జతచేశారు.
Tags: Jagan, Ravishankar prasad, Letter Online gambling apps

ఇండియాలో నంబర్ వన్ ఓటీటీ ఏది?

ఒకప్పుడు కొత్త సినిమా అంటే థియేటర్లలో మాత్రమే రిలీజయ్యేది. కానీ ఇప్పుడు నేరుగా మన ఇంట్లోని టీవీలో విడుదలైపోతోంది. ఈ విప్లవానికి కారణం ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్. ఇంతకుముందు ఇవి కొత్త సినిమాలు రిలీజైన నెల నుంచి రెండు మూడు నెలల మధ్య కొత్త సినిమాలను విడుదల చేసేవి. కానీ కరోనా ధాటికి థియేటర్లు మూతపడ్డ గత ఆరేడు నెలల్లో కొత్త సినిమాలను నేరుగా రిలీజ్ చేసి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచాయి. ఈ క్రమంలో వీటికి అనూహ్యమైన ఆదరణ లభించింది. సబ్‌స్క్రైబర్లు భారీగా పెరిగారు. ఆహా లాంటి లోకల్ యాప్ సైతం సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ క్రమంలో ఇండియాలో అత్యధికంగా ఆదరణ పొందుతున్న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఏది.. దేనికి అధిక స్థాయిలో సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.. వీటిలో ఏది నంబర్ వన్ అన్న ప్రశ్నలు తలెత్తడం సహజం.

ఒక బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ ట్విట్టర్ ద్వారా ఈ విషయమై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆయన సమాచారం ప్రకారం ఇండియాలో నంబర్‌వన్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్.. డిస్నీ+హాట్‌స్టార్. ఆ సంస్థకు ఇండియాలో ప్రస్తుతం 2.05 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ముందు నుంచి ఎక్స్‌క్లూజివ్ స్పోర్స్స్‌ కంటెంట్‌తో భారీగా ఫాలోవర్లను సంపాదించుకున్న ఈ సంస్థ.. గత కొన్ని నెలల్లో పెద్ద ఎత్తున కొత్త కంటెంట్ పెంచి సబ్‌స్క్రైబర్లను పెంచుకుంది. ప్రస్తుతం నడుస్తున్న ఐపీఎల్‌తో దీనికి ఆదరణ ఇంకా పెరిగింది.

ఇక ఇండియన్ ఫిలిం, వెబ్ కంటెంట్‌ను గత కొన్నేళ్లలో భారీగా పెంచిన అమేజాన్ ప్రైమ్‌.. 82 లక్షల మంది సబ్‌స్క్రైబర్లతో రెండో స్థానంలో ఉంది. హిందీ సినిమాలు, సీరియళ్లతో పాటు లోకల్ కంటెంట్ బాగా అందుబాటులోకి తెచ్చిన జీ5 49 లక్షల సబ్‌స్క్రిప్షన్లతో మూడో స్థానంలో ఉంది. తర్వాతి స్థానంలో ఏక్తా కపూర్‌కు చెందిన ఏఎల్టీ బాలాజీ సంస్థ ఉండటం విశేషం. దాని సబ్‌స్క్రైబర్లు 40 లక్షలు. ఇక ఇంటర్నేషనల్ కంటెంట్‌ను భారీ స్థాయిలో అందిస్తూ ప్రపంచంలోనే నంబర్ వన్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌గా ఉన్న నెట్‌ఫ్లిక్స్‌కు ఇండియాలో ఐదో స్థానానికి పరిమితమైంది. దాని సబ్‌స్క్రైబర్ల సంఖ్య 31 లక్షలట. దాని సబ్‌స్క్రిప్షన్ ధర ఎక్కువుండటం, లోకల్ కంటెంట్ తక్కువుండటం ఇందుక్కారణం కావచ్చు.

గోరింటాకు పొడి, నిమ్మరసం తలకు పట్టిస్తే..?

న్యూస్ ఇండియా హెల్త్…చాలామందికి తలలో చుండ్రు ఎక్కువగా ఉంటుంది. ఆ చుండ్రును తొలగించుకోవడానికి ఏవేవో నూనెను, షాంపూలు వాడుతుంటారు. అయిన కూడా ఎలాంటి ఫలితాలు కనిపించలేదని బాధపడుతుంటారు. ఇప్పటి చలికాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ కింది చిట్కాలు పాటిస్తే.. చుండ్రు సమస్య నుండి తెలిగ్గా బయటపడొచ్చని చెప్తున్నారు.. అవేంటో చూద్దాం..

1. కప్పు గోరువెచ్చని నీటిలో కొన్ని వేపాకులను రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయాన్నే ఆ వేపాకులను తీసేసి ఆ నీటిని తలకు రాసుకోవాలి. అరగంట తరువాత తలస్నానం చేయాలి. వారంలో ఇలా మూడుసార్లు చేస్తే చుండ్రు సమస్యపోతుంది.

2. యాపిల్ సైడర్ వెనిగర్‌లో కొద్దిగా నీరు కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. షాంపూకు బదులుగా ఈ మిశ్రమాన్ని తలకు వాడాలి. యాపిల్ సైడర్ వెనిగర్‌లో ఉండే యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు తలపై ఉండే క్రిములను తొలగిస్తుంది. దాంతో చుండ్రు కూడా పోతుంది.

3. గోరింటాకు పొడిలో 5 స్పూన్ల చక్కెర, స్పూన్ ఆలివ్ ఆయిల్, నిమ్మరసం కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పూతలా పట్టించాలి. 45 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. వారంలో కనీసం ఒకటి రెండుసార్లు ఇలా చేస్తే చుండ్రు సమస్య ఉండవు.

4. ఓ పాత్రలో గులాబీ ఆకులను మరిగించుకోవాలి. అనంతరం ఆ నీటిని తలకు రాసుకోవాలి. గంట తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా తరచు చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది.

నేరం లక్ష్మి.,
బ్యూటీ న్యూస్ హెడ్.,