పుణ్యస్నానాలతో కుంభమేళా ఆరంభం

 న్యూస్ ఇండియా24/7 భక్తి న్యూస్ నెట్వర్క్….. (మైసూరు) టి.నరసీపురలో ఆదివారం దక్షిణాది కుంభమేళా ఆరంభమైంది. కావేరి, కపిలా, స్పటికతీర్థ సంగమమైన ఈ ప్రాంతం అత్యంత పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు. వివిధ మఠాధిపతులు తెల్లవారుజాము నుంచే వివిధ ధార్మిక కార్యక్రమాల్ని నిర్వహించారు. గణపతి హోమం, ఇతర హోమాలు పూర్తవగానే భక్తుల పుణ్యస్నానాలు మొదలయ్యాయి. ప్రమాదానికి అవకాశం లేకుండా గజ ఈతగాళ్లు అనుక్షణం అప్రమత్తంగా కాపలా కాశారు. గుంజా నరసింహస్వామి ఆలయం నుంచి స్నానఘట్టం చేరుకునే ప్రాంతం భక్తులతో సందడిగా కనిపించింది. నది మధ్యలో సంగమం వద్ద నిర్మించిన ప్రధాన వేదికను చేరుకునేందుకు సైనికులు నిర్మించిన తాత్కాలిక వంతెన ఎంతో ఉపయోగపడింది.ముఖ్యమంత్రి కుమారస్వామి, ఇతర ప్రముఖులు సోమవారం పుణ్యస్నానాలు చేసే అవకాశం ఉంది. రాత్రివేళ ఈ ప్రాంగణాన్ని విద్యుద్దీపాలతో సింగారించారు. లోపాలు ఎదురైతే వెంటనే సరిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా…

Read More

ఢిల్లీలో భారీ వర్షం: వడగళ్ల వాన

న్యూస్ ఇండియా24/7 న్యూస్ నెట్వర్క్(8.45 p.m బులిటిన్)… ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాలైన నోయిడా, ఘాజియాబాద్‌లలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఫిబ్రవరి 7 గురువారం మధ్యాహ్నం నుంచి వడగళ్లతో కురుస్తున్న వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. గాలిలోని నీటి ఆవిరి కూడా రికార్డు స్థాయిలో 89 శాతంగా నమోదైంది. 24 గంటల్లో 1మి.మీ వర్షపాతం నమైదైందని మెరుపులతో కూడిన వర్షాలు వచ్చే సూచనలున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఈ వర్షాల కారణంగా ఢిల్లీ నగరంలో తిరిగే 16 రైళ్లు 2నుంచి 6 గంటలు ఆలస్యంగా తిరుగుతున్నాయి. వర్షం కారణంగా వాతావరణాన్ని మంచు కప్పేయడంతో దారి కనిపించక రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది.

Read More

నోయిడా ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం..

న్యూస్ ఇండియా24/7 న్యూస్ నెట్వర్క్(8.30 p.m బులిటిన్)…న్యూఢిల్లీ: ఢిల్లీలోని గ్రేటర్‌ నోయిడాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సెక్టార్‌ 12లోని మెట్రో ఆస్పత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది అద్దాలు పగులగొట్టి అందులో ఉన్న రోగులను బయటకు తీసుకువస్తున్నారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటల అదుపునకు యత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Read More

తెలంగాణపై చంద్రబాబుకు విద్వేషం…ప్రధాని మోదీ

THE NEWS INDIA 24/7 POLITICAL NEWS NETWORK – ఓటమి వల్ల అక్కసుతోనే అలా మట్లాడుతున్నారు – తెలంగాణలో మహాకూటమికి పట్టిన గతి ఏమిటో తెలిసిందే  -ఏఎన్‌ఐ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు న్యూఢిల్లీ, జనవరి 3: తెలంగాణ పై విద్వేషంతోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఏఎన్‌ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకు బదులిస్తూ, చంద్రబాబుకు తెలంగాణ అంటే ద్వేషం అని చెప్పారు. అందుకే తనకూ, కేసీఆర్‌కు సంబంధం అంటగట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఆయన పార్టీని దేనికీ పనికిరాకుండా చేశారు. అందుకే ఆయన ఆ రాష్ట్రంపై అక్కసుతో అలా మాట్లాడుతున్నారు. అది ఆయన సమస్య అని అన్నారు.…

Read More