టాపర్ ను ఫెయిల్ చేసిన వైనం! నీట్ ఫలితాల్లో గందరగోళం..

All India topper declared as failed in NEET 2020 exam

ఎంబీబీఎస్, బీడీఎస్ కాలేజీల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్ ఫలితాల పట్ల దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టాపర్ గా నిలిచిన విద్యార్థిని ఫెయిల్ అయినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. వివరాల్లోకి వెళ్తే, మృదుల్ రావత్ అనే విద్యార్థికి తొలుత ఫెయిల్ మార్కులు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఓఎంఆర్ షీటును రీచెకింగ్ చేయిస్తే… ఎస్టీ కేటగిరీలో ఆలిండియా టాపర్ గా రావత్ నిలిచాడు. 17 ఏళ్ల రావత్ రాజస్థాన్ లోని మాధోపూర్ జిల్లా గంగాపూర్ కు చెందిన విద్యార్థి. అక్టోబర్ 16న నీట్ ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో రావత్ కు 720కి గాను 329 మార్కులు వచ్చినట్టు మార్కుల జాబితాలో ఉంది. ఆ తర్వాత రీచెక్ చేయించడంతో అతనికి 650 మార్కులు వచ్చినట్టు…

Read More

” మళ్లీ మీరే రావాలి “… ఏపీలో టి.ఎన్ .ఐ( న్యూస్ ఇండియా ) సర్వే సంచలన విషయాలు …!!

TNI (News India) survey sensational news on AP ... !!

2019 ఎన్నికల్లో టీడీపీ నినాదం.. ‘మళ్లీ మీరే రావాలి’ అని! ఇక వైకాపా నినాదం.. ‘రావాలి జగన్ – కావాలి జగన్’ అని! అయితే ఏపీ వాసులు మాత్రం ఆ ఎన్నికల్లో ‘జగన్ రావాలి’ అనుకున్నారు.. ఫలితాలు ఊహలకందకుండా ఇచ్చారు..తెలుగు తమ్ముళ్లకు దిమ్మ తిరిగేలా అందించారు! అయితే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ వాసులు ఏమనుకుంటున్నారనే విషయాలపై టి.ఎన్ .ఐ ( న్యూస్ ఇండియా )నిర్వహించిన సర్వే సంచనల విషయాలు వెల్లడించింది. తాజాగా చేసిన ఈ సర్వేలో వైకాపాకు నాలుగు శాతం ఓట్లు పెరిగాయి ! అవును… గత ఏడాది ఫలితాల్లో వైకాపాకు 50 శాతం ఓట్లు వస్తే ఇపుడు సర్వేలో 54 శాతం ఓట్లు వచ్చాయి ! ఏడాదిన్నర కాలంగా జగన్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఇది ప్రజలు ఇచ్చిన బహుమతిగా చెబుతున్నారు విశ్లేషకులు ! ఫలితంగా……

Read More

టీఆర్పీ రేటింగ్ స్కామ్… రిపబ్లిక్ టీవీ సీఈఓ, సీఓఓలపై పోలీసుల ప్రశ్నల వర్షం!

TRP rating scam ... Police questions rain on Republic TV CEOs and CEOs

దేశవ్యాప్తంగా కలకలం రేపిన టీఆర్పీ రేటింగ్ స్కామ్ లో రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వికాస్ ఖాన్ చందానీ, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ హర్ష్ భండారీలపై ముంబై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. వికాస్ ను 9 గంటల పాటు, భండారీని 5 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. ఈ విషయమై స్పందించిన రిపబ్లిక్ టీవీ, తమ ఉద్యోగులను ఆదివారం నాడు పోలీసులు 20 గంటల పాటు ప్రశ్నించారని, పత్రికా స్వేచ్ఛను అడ్డుకునే ఒత్తిళ్లకు తాము తలొగ్గబోమని స్పష్టం చేసింది. ఈ స్కామ్ లో హంస ఏజన్సీ ఇచ్చిన ఫిర్యాదు కాపీని ఎలా సంపాదించారని తమ ఉద్యోగులను ప్రశ్నించగా, అది ఎడిటోరియల్ విభాగానికి సంబంధించిన విషయమని సమాధానం ఇచ్చామని పేర్కొంది. హంస ఏజెన్సీ ఫిర్యాదులో తమపై ఏ విధమైన ఆరోపణలు లేవన్న విషయాన్ని ప్రస్తావించింది. Tags:…

Read More