కనుమరుగైన రాగి పాత్రలు….

న్యూస్ ఇండియా24/7హెల్త్ న్యూస్ నెట్వర్క్…పూర్వం అందరి ఇండ్లల్లో ఎక్కడ చూసినా రాగి పాత్రలు కనిపించేవి. దాదాపు అవి లేని ఇండ్లు అంటు ఉండకపోయేవి. కాలగమనంలో పద్ధతులు, సంప్రదాయాలు పూర్తిగా మారాయి. ఆధునిక యుగంలో పూర్తిగా రాగి పాత్రలు, గ్లాసులు కనుమరుగైన స్థితి కనిపిస్తోంది. నేడు స్టీల్‌, ప్లాస్టిక్‌ పాత్రలు, గ్లాసులు వాటి స్థానాన్ని భర్తీ చేశాయి. కనుమరుగైన రాగి పాత్రల గురించి, వాటి ఆవశ్యకత గురంచి  తెలుసుకుందాం. 
 
ఆరోగ్యంగా, యవ్వనంగా ..

ఆరోగ్యంగా, యవ్వనంగా కన్పించేందుకు ఎటువంటి రోగాలు రాకుండా ఉండాని ప్రతి ఒక్కరూ రాగి చెంబు, రాగి గ్లాసులో తాగే వారు. చాలా మంది క్రమం తప్పకుండా రాత్రంతా నీటిని రాగి చెంబులో నిల్వ ఉంచి, పరిగడుపున తాగే వారు. ఇలా తాగితే కడుపులో ఉన్న మలినాలు, తొలగిపోవడమే కాకుండా పేగులను సైతం శుభ్రం చేస్తాయని శాస్త్రీయ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆరోగ్య పరిరక్షణలో కీలక భూమిక రాగి పాత్రల దేనని చెప్పొచ్చు. రాగిలో దాగి ఉన్న నీరు తాగడం వలన అజీర్ణం, ఊబకాయం, థైరాయిడ్‌తో పాటుగా మరి కొన్ని రోగాలు నయమవుతాయి. రాగి పాత్రలో నీరు నిల్వతో కొలస్ట్రాల్‌, ట్రైగ్లీజరైడ్‌, దానికి తోడు వృద్ధాప్య ఛాయలు కన్పించవని చెబుతుంటారు. 
ఆధునిక యుగంలో నేడు రాగి పాత్రలు, గ్లాస్‌లు కనుమరుగయ్యాయి. స్టీల్‌ పాత్రలు, గ్లాస్‌లు, ఇంకా ప్లాస్టిక్‌ యుగం వచ్చింది. ప్రతిదీ ప్లాస్టిక్‌మయవుతోంది. స్టీల్‌ పాత్రల్లో కాకుండా రాగి పాత్రల్లోనే ఆహారం, నీరు తీసుకోవాలని, తద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చునని వైద్యులు సూచిస్తున్నారు.

కీర దోసను తొక్కతో తినేస్తే…?

న్యూస్ ఇండియా 24/7 హెల్త్ న్యూస్ నెట్వర్క్….సాధారణంగా కీరా దోసకాయ తినేటప్పుడు ప్రతి ఒక్కరు తొక్కను తీసి తింటారు. తొక్క తీసి వేయడం వల్ల దానిపై చేరిన వాతావరణ కాలుష్య పదార్థాలు తొలగిపోతాయి. అయితే వీటితో పాటుగా ఎన్నో అత్యవసర పోషకాలు కూడా తొలగిపోతాయి. అలాకాకుండా కొంచెం నీటిలో ఉప్పు వేసి కీరదోసని కాసేపు ఆ నీటిలో ఉంచి శుభ్రంగా కడిగి తొక్కతో సహా కీరదోసని తినడం వల్ల అనేక రకములైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో చూద్దాం.

1. కీరా తొక్కలో పీచుపదార్ధం అధికంగా ఉంటుంది. ఇది నీటిలో కరుగదు కనుక మన జీర్ణనాళంలో నుండి నెట్టివేయబడుతుంది. జీర్ణం కాని వ్యర్ధాలు అధికంగా తయారుకావటం వలన మలబద్దకం దరిచేరదు.

 

2. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లలో భాగంగా రోజుకు 25 గ్రాముల ఫైబర్ తీసుకోవాలి. పురుషులలో ఇది 39 గ్రాములు. కీరా లోపల ఉండే పీచు పదార్ధం నీటిలో కరిగిపోతుంది. ఇది కూడా శరీరానికి మేలు చేస్తుంది. ఇది విసర్జకాలను మృదువుగా మారుస్తుంది.

3. కీరాలో ఉండే విటమిన్ కెలో చాలా భాగం చెక్కులోనే ఉంటుంది. విటమిన్ కె రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది. ఒక కప్పు చెక్కులో 49 మైక్రో గ్రాముల విటమిన్ కె ఉంటుంది. అదే తొక్క తీసిన కీరాలో ఇది 9 మైక్రో గ్రాములు మాత్రమే ఉంటుంది.

4. కీరాను ఎప్పుడు కావాలంటే
అప్పుడు తినేయవచ్చు, ఎందుకంటే, వీటిలో సహజంగా కెలోరీలు తక్కువగా ఉంటాయి. ఒక కీరా ముక్కలో 1-2 కెలోరీలు ఉంటాయి. డైటింగ్ చేస్తున్నప్పటికి, మధ్యాహ్న సమయాల్లో కొన్ని తొక్క తీయని కీరా ముక్కలు తినడం వలన ఎటువంటి నష్టం వుండదు.

5. కీరా చెక్కులో బీటా కెరోటిన్, విటమిన్ ఎ వుంటుంది. ఇది మన కళ్లకు ప్రయోజనం చేకూరుస్తుంది. విటమిన్ ఎ వివిధ సమ్మేళనాలలో లభిస్తుంది. కీరా చెక్కులో ఇది అధికంగా ఉంటుంది.

గోరింటాకు పొడి, నిమ్మరసం తలకు పట్టిస్తే..?

న్యూస్ ఇండియా హెల్త్…చాలామందికి తలలో చుండ్రు ఎక్కువగా ఉంటుంది. ఆ చుండ్రును తొలగించుకోవడానికి ఏవేవో నూనెను, షాంపూలు వాడుతుంటారు. అయిన కూడా ఎలాంటి ఫలితాలు కనిపించలేదని బాధపడుతుంటారు. ఇప్పటి చలికాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ కింది చిట్కాలు పాటిస్తే.. చుండ్రు సమస్య నుండి తెలిగ్గా బయటపడొచ్చని చెప్తున్నారు.. అవేంటో చూద్దాం..

1. కప్పు గోరువెచ్చని నీటిలో కొన్ని వేపాకులను రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయాన్నే ఆ వేపాకులను తీసేసి ఆ నీటిని తలకు రాసుకోవాలి. అరగంట తరువాత తలస్నానం చేయాలి. వారంలో ఇలా మూడుసార్లు చేస్తే చుండ్రు సమస్యపోతుంది.

2. యాపిల్ సైడర్ వెనిగర్‌లో కొద్దిగా నీరు కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. షాంపూకు బదులుగా ఈ మిశ్రమాన్ని తలకు వాడాలి. యాపిల్ సైడర్ వెనిగర్‌లో ఉండే యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు తలపై ఉండే క్రిములను తొలగిస్తుంది. దాంతో చుండ్రు కూడా పోతుంది.

3. గోరింటాకు పొడిలో 5 స్పూన్ల చక్కెర, స్పూన్ ఆలివ్ ఆయిల్, నిమ్మరసం కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పూతలా పట్టించాలి. 45 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. వారంలో కనీసం ఒకటి రెండుసార్లు ఇలా చేస్తే చుండ్రు సమస్య ఉండవు.

4. ఓ పాత్రలో గులాబీ ఆకులను మరిగించుకోవాలి. అనంతరం ఆ నీటిని తలకు రాసుకోవాలి. గంట తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా తరచు చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది.

నేరం లక్ష్మి.,
బ్యూటీ న్యూస్ హెడ్.,

బొప్పాయితో గుండె పదిలం!

న్యూస్ ఇండియా హెల్త్ & బ్యూటీ…రోజూ పరగడుపున చిన్న బొప్పాయి ముక్క లేదా అరకప్పు బొప్పాయి ముక్కల్ని తీసుకుంటే బరువు తగ్గడమే కాకుండా.. గుండె ఆరోగ్యానికి మేలుచేసిన వారవుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే పండ్లలో యాపిల్‌ను డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులోని పొటాషియం, ఫాస్పరస్‌ చాలా మేలు చేస్తాయి. 
రోజులో ఏదో ఓ సమయంలో అరటిపండు తినడం కూడా మంచిది. అరటిలోని కెరోటినిన్‌ అనే పదార్థం మానసిక వ్యాకులతను దూరం చేస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదు. అలాగే చేపలు తినడం ద్వారా ఒమేగా 3 ఫ్యాట్స్‌ లభిస్తాయి. ఇవి గుండెపోటును అరికడతాయి. శరీరానికి కావాల్సిన నీటిని, పీచుపదార్థాలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారు. గుండెకు అవసరమయ్యే ఫైబర్‌, విటమిన్స్‌, మినరల్స్‌ గోధుమల్లో పుష్కలంగా లభిస్తాయి. ఇది గుండెకు హాని కలిగించే కొవ్వుని నివారిస్తుంది. ఫైబర్‌ కొవ్వుతో కలిసి దానిని బయటికి పంపేందుకు పనిచేస్తుంది. ఇంకా ఫైబర్‌ దొరికే పదార్థాలలో ఓట్స్‌, బార్లీ, రాగి, జొన్న వంటివి ముఖ్యమైనవి. ఇక ముఖ్యంగా అధికకొవ్వు తగ్గించడంలో ఉల్లిపాయలు మంచి మందులా పనిచేస్తాయి.

అందుకే ఉల్లిపాయలు రోజువారీ ఆహారంలో ఉండేలా చూడాలి.