ఒప్పంద ఉద్యోగాలు …జోరుగా….అమ్మకాలు …!!

న్యూస్ ఇండియా 24/7న్యూస్ నెట్వర్క్… 132/33 కేవీ విద్యుత్తు ఉపకేంద్రం ఒప్పంద ఉద్యోగాలు …జోరుగా…అమ్మకాలు ఒక్కో కొలువుకు రూ.5 లక్షల వరకూ వసూళ్లు! కలసపాడు, కాశినాయన మండలాల్లో శాశ్వతంగా విద్యుత్తు సమస్యలు పరిష్కరించేందుకు.. నాణ్యమైన విద్యుత్తు అందించేందుకు కలసపాడు సమీపంలోని తెల్లపాడు రహదారిలో నూతనంగా రూ.20 కోట్లతో 132/33 కేవీ విద్యుత్తు ఉపకేంద్రం నిర్మించారు. రెండు నెలల కిందట ఈ పనులు పూర్తయ్యాయి. ఈ నెల 14న ఉపకేంద్రాన్ని ప్రారంభించాలని అధికారులు భావించారు. ఒప్పంద ఉద్యోగాల కోసం ఒత్తిళ్లతో వాయిదా పడినట్లు సమాచారం. ఉపకేంద్రంలో 4 షిఫ్ట్‌ ఆపరేటర్లు (డిప్లమో), 4 లైన్‌మెన్లు (ఐటీఐ), 2 వాచ్‌మెన్లు (పదో తరగతి) విద్యార్హతతో ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంది. ఉపకేంద్రం నిర్మించిన గుత్తేదారు ఒప్పంద ఉద్యోగులను ఎంపికచేసి రెండేళ్ల పాటు వేతనాలు అందించాలి. ఈ ఉద్యోగాల కోసం కొద్ది రోజులుగా పెద్ద…

Read More

ప్రతీ శనివారం నాడు ఇలా చేస్తే….

న్యూస్ ఇండియా24/7 భక్తి న్యూస్ నెట్వర్క్….ఆంజనేయ స్వామిని ఎప్పుడు, ఎలా పూజించాలో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాలి. ఆరోగ్యానికి, శారీరక దృఢత్వానికి, స్థిరత్వానికి చిహ్న మూర్తి హనుమంతుడు. అలాంటి ఆంజనేయుడిని ప్రతిరోజూ పూజిస్తే శుభ ఫలితాలుంటాయి. అలానే వారాల్లో శనివారం, మాసంలో వచ్చే అమావాస్య నాడు హనుమంతుడిని కొలిచే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. హనుమంతుడిని పూజించడానికి స్వామివారి పటం ఎంచుకోండి. పువ్వులు, పండ్లు, బియ్యం, దీపం, మిఠాయిలు, మట్టికండ అవసరం. శనివారం రోజున గోధుమలు, పప్పు, బెల్లం, నెయ్యి, ఉప్పు, పసుపుకొమ్ములు, బంగాళాదుంపలు, ఏదైనా ఆకుపచ్చని కూరగాయల్ని బ్రాహ్మణులకు దానం చేయాలి.   హనుమంతుడి పటాన్ని లేదా విగ్రహాన్ని ఓ ప్రదేశంలో ఉంచి అలంకరించాలి. దీపం వెలిగించి పువ్వులు, బియ్యం సమర్పించి పూజ చేయాలి. ఇకపోతే.. హనుమంతుడికి సిందూరం అంటే మహాప్రీతి. సీతమ్మ తల్లిని నుదుటిపై…

Read More

ఒక్కరోజే 1.5 కోట్ల మంది పుణ్యస్నానాలు

న్యూస్ ఇండియా న్యూస్ నెట్వర్క్..(అలహాబాద్‌) జనవరి 15న మకర సంక్రాంతి రోజు కుంభమేళా ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఆదివారం వసంత పంపచమి పర్వదినం సందర్భంగా పవినత్ర స్నానాలు చేసేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది భక్తులు అలహాబాద్‌కు పోటెత్తారు. గజగజ వణికించే చలిని సైతం లెక్కచేయకుండా తెల్లవారుజామున నుంచే భక్తులు స్నాన ఘట్టాలకు బారులు తీరారు. పవిత్ర త్రివేణి సంగమం వద్ద ఈ ఒక్క రోజే సుమారు 1.5 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు ప్రకటించారు. సూర్యోదయానికి ముందే 50 లక్షల మంది భక్తులు గంగలో మునకేసినట్లు చెప్పారు.ప్రస్తుత కుంభమేళాలో మూడోది, చివరిదైన షాహీ స్నాన్‌ను వసంత పంచమి సందర్భంగా చేసేందుకు భక్తులు పోటీపడ్డారు. ఈ సందర్భంగా వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. స్నానాలు చేసేందుకు, తిరిగి వెళ్లేందుకు…

Read More

గిరిజనులకు చంద్రబాబు వరాల జల్లు

న్యూస్ ఇండియా27/7 న్యూస్ నెట్వర్క్…తెలుగుదేశం ప్రభుత్వం గిరిజనుల  అభ్యున్నతికి కృషి చేస్తూ ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టింది. గిరిజనులకు నేనున్నాను అంటూ  పెద్దన్న పాత్ర పోషించారు చంద్రబాబు,  వారి రుణం తీర్చుకునే భాగంగా… చంద్రబాబు గిరిజనులకు వృద్ధాప్య పింఛను వయోపరిమితిని తగ్గించారు, ప్రస్తుతం అన్ని వర్గాల వారికి వృద్ధాప్యంలో పింఛను పొందడానికి వయోపరిమితి 65 ఏళ్లుగా ఉంది. అయితే గిరిజనులకు 50 ఏళ్లకే పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గ్రామీణ అభివృద్ధి శాఖ జీవో ఎంఎస్ నెంబర్ 49 ని ఆదివారం రాత్రి విడుదల చేసింది. అర్హులైన వారి వివరాలను సేకరించాలని మండల పరిషత్ అధికారులకు సర్ఫ్ ఆదేశాలు జారీ చేసింది.

Read More