‘ పసిడి ‘వార్తలపై స్పందించిన కేంద్రం

ఇండియా న్యూస్ టుడే 24/7నేషనల్ న్యూస్ నెట్వర్క్….(ఢిల్లీ) పరిమితికి మించి నిల్వ ఉన్న బంగారం వివరాలను స్వచ్ఛందంగా ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వం క్షమాభిక్ష పథకాన్ని తీసుకువస్తుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ వార్తల్లో వాస్తవం లేదని ఇవాళ కేంద్ర ఆర్థికశాఖ పేర్కొన్నది. గోల్డ్ ఆమ్నెస్టీ స్కీమ్‌ను తీసుకువచ్చే ప్రతిపాదన ఐటీశాఖకు లేదని కేంద్రం వెల్లడించింది. బడ్జెట్ తయారీ సమయంలో ఇలాంటి వార్తలు వ్యాపిస్తుంటాయని కేంద్రం అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ ప్రతినిధులతో గోల్డ్‌ బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు కూడా వార్తలు వెలుబడిన విషయం తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరమే ఈ బోర్డు ఏర్పాటయ్యేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని సన్నిహిత వర్గాల సమాచారం. కొనుగోలుదారులను ఆకర్షించేలా ఈ బోర్డు ఎప్పటికప్పుడు తగిన సలహాలు, సూచనలు, ప్రతిపాదనల్ని చేయనున్నది. అంతేగాక దేశంలో చట్టబద్ధంగా పసిడి నిల్వలు పెంపొందడానికీ కృషి చేయనున్నది. గోల్డ్ బోర్డు ఏర్పాటుపై వస్తున్న వార్తలపై ఇంకా క్లారిటీ రాలేదు.

Related posts

Leave a Comment