లంచ తీసుకుంటూ పట్టుబడిన వీఆర్వో

 న్యూస్ నెట్వర్క్24/7 క్రైమ్ న్యూస్ నెట్వర్క్  ( ఖమ్మం)  జిల్లాకు చెందిన కలకోడ గ్రామ వీఆర్వో శ్రీనివాసరావు ఏసీబీకి చిక్కారు. పట్టా పాసుపుస్తకం కోసం రూ. ఐదు వేల లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. వల పన్నిన అవినీతి నిరోదక శాఖ అధికారులు బాధితుడి నుంచి వీఆర్వో లంచం తీసుకుంటుండగా పట్టుకుని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు లంచం ఇవ్వడం, లంచం తీసుకోవడం నేరమని ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Related posts

Leave a Comment