ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష పార్టీలు చెయ్యలేని సంచలనాన్ని సృష్టించారు…!!

న్యూస్ ఇండియా24/7 న్యూస్ నెట్వర్క్..

చంద్రబాబును ఉతికి ఆరేసిన కేసీఆర్….

మాటలా అవి ? మర ఫిరంగులు పలుకులా అవి? పర్జన్య గర్జనలు అగ్నివర్షం కురిసినట్లు పర్వతాలు కదిలినట్లు అణు విస్పోటం సంభవించినట్లు వంద తుఫానులు, వెయ్యి సునామీలు విరుచుకుని పడ్డట్లు మనం కూర్చున్న కుర్చీ కింద మందుపాతర పేలినట్లు సవ్యసాచి ఒకేసారి రెండు హస్తాలతో ధనుర్బాణాలు వదిలినట్లు శిశుపాలుడిపై శ్రీకృష్ణుడు సుదర్శనచక్రం ప్రయోగించి మొండెం నుంచి మస్తకాన్ని వేరుచేసినట్లు!ఒకే ఒక పత్రికాసమావేశంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గత నాలుగేండ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష పార్టీలు చెయ్యలేని సంచలనాన్ని సృష్టించారు.

చంద్రబాబు పరమ చెత్త రాజకీయ నాయకుడు. చంద్రబాబుకు నీతి జాతి లేవు.పచ్చి అబద్ధాలకోరు. హరికృష్ణ శవం మీద పేలాలు ఏరుకున్నాడు. అయన కూతురును బలిచేశాడు. మామకు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నాడు.చంద్రబాబుకు హిందీ రాదు, ఇంగ్లిష్ రాదు.. ఏమి చక్రం తిప్పుతాడు ఢిల్లీలో? నా ఆర్థిక మోడల్‌పై నీకు కనీస అవగాహన ఉందా?అంతా డబ్బాల బాకానే ప్రత్యేకహోదా నువ్వే కావాలంటావు.. నువ్వే వద్దంటావు. నీకసలు క్లారిటీ ఎక్కడుంది?మొన్న ఏముఖం పెట్టుకుని విజయవాడ వస్తావని రాహుల్‌ను ప్రశ్నించాడు ఇవాళ ఏముఖం పెట్టుకుని ఆంధ్రాకు వస్తావని మోదీని అంటున్నాడు.. అసలు నీకు సిద్ధాంతం ఉన్నదా?రాజధాని కోసం కేంద్రం ఇచ్చిన 2500 కోట్లు నాకేశావా?ఒక వంక అభివృద్ధిలో ముందుకుపోతున్నాం అంటూ శ్వేతపత్రాలు, మరొక వంక చేతులు చాచి హోదా కావాలి అంటూ అడుక్కోవడం. పత్రాలు నిజమా? అభివృద్ధి నిజమా?

పై విమర్శల్లో దేన్ని ఖండించాలి? ఫలానా పాయింట్ తప్పు అని ఖండించే సాహసం ఎవరికైనా ఉన్నదా? ఒక్కటైనా అబద్ధం ఉన్నదా? ఆంధ్రులకు తెలియదా?ఒక్క మాటలో చెప్పాలంటే ఐదు కోట్ల ఆంధ్రుల మనోభావాలు కేసీఆర్ నోటివెంట వెలువడ్డాయి. అందుకే కేసీఆర్ వదిలిన శస్ర్తాలను ఆంధ్రులంతా హర్షించారు. సోషల్‌మీడియాలో ఎక్కడచూసినా, ఎవరి ప్రొఫైల్ చూసినా, కేసీఆర్ ప్రెస్‌మీట్ క్లిప్పింగులే కనిపిస్తున్నాయి. ఇది చాలదా చంద్రబాబు దుర్మార్గపాలన పట్ల నిరసన ఏ స్థాయిలో ఉన్నదో చెప్పడానికి? నిన్న కేసీఆర్ చేసినవి అక్షరాలా నిర్మాణాత్మక విమర్శలు.. అంశాలవారి విమర్శలు..

ఇక బుద్ధిలేని ఆంధ్రామంత్రులు విమర్శలు చేశారు..

కేసీఆర్ భాష దరిద్రం కేసీఆర్ తాగుబోతు దమ్ముంటే ఆంధ్రకు వచ్చి పోటీ చెయ్యి ఇవా కేసీఆర్ విమర్శలకు జవాబులు? కేసీఆర్ ప్రస్తావించిన పదిహేను అంశాలమీద గణాంకాలతో ఎదుర్కొనే దమ్ము, తెలివి, జ్ఞానం లేవా? ఒక్క మంత్రికైనా పరిపాలనా విషయాలమీద కనీస అవగాహన ఉన్నదా? వారేమైనా మహాపండితులా? సంస్కృతాంధ్రఆంగ్ల భాషల్లో ఉద్ధండులా? నాలుగు వేమన పద్యాలు చెప్పండి ఒక్క మంత్రి అయినా? పుష్కరం క్రితం అసెంబ్లీలో చంద్రబాబును వైఎస్సార్ కడిగిపారేశారు.మళ్ళీ నిన్న కేసీఆర్ అంతకు పదింతలు కడిగేశారుఇలపావులూరి మురళీమోహనరావు ., సీనియర్ రాజకీయ విశ్లేషకులు..

 

 

Related posts

Leave a Comment