లోక్‌సభ ఎన్నికలకు గులాబీ బాస్ వ్యూహమేంటి..?

న్యూస్ ఇండియా న్యూస్ నెట్వర్క్….   హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన గులాబీ పార్టీ ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించింది. ఎలాగైతే అసెంబ్లీలో ఘనవిజయం సాధించిందో 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా విజయఢంకా మోగించాలని భావిస్తోంది. ఇందుకోసం గ్రౌండ్ వర్క్ అప్పుడే మొదలెట్టినట్లు సమాచారం. టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ వ్యక్తిగతంతా దీన్ని సమీక్షిస్తున్నట్లు సమాచారం. మరి లోక్‌సభ ఎన్నికలకు సీఎం కేసీఆర్ ఎలాంటి వ్యూహం రచించబోతున్నారు… అత్యధిక సీట్లు నెగ్గడం ద్వారా దేశ రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు..?

2019 గులాబీ బాస్ గురి
2019 ఎన్నికలపై గులాబీ బాస్ గురి

ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఘన విజయం సాధించి చరిత్ర తిరగరాసిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఇక తన తదుపరి టార్గెట్‌గా 2019 లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించారు. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంటు సీట్లు ఉండగా అందులో 16 సీట్లను గెలుచుకునేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు సీఎం కేసీఆర్. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించి దేశ రాజకీయ ముఖ చిత్రంలో ఒక ఐకాన్‌గా కేసీఆర్ నిలిచారు. ఇక తన విజయం తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తాను దేశ రాజకీయాలపై దృష్టి సారిస్తానని చెప్పారు. దేశంలో గుణాత్మకమైన మార్పు రావాల్సి ఉందని చెప్పిన గులాబీ బాస్ ఆ మార్పునకు తనే ముందడుగు వేయబోతున్నట్లు చెప్పారు. అంతకంటే ముందు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి దేశరాజకీయాల్లో సత్తా చాటేందుకు సిద్దమవుతున్నారు కల్వకుంట్ల చంద్రశేఖర రావు.

 

Related posts

Leave a Comment