త్రిముఖం..ఆసక్తికరం

న్యూస్ ఇండియా 24 / 7 న్యూస్ నెట్వర్క్...ఖైరతాబాద్ కోటలో పాగాకు యత్నిస్తున్న గులాబీ దళం- జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సత్తాచాటిన టీఆర్‌ఎస్ -మైనార్టీల మద్దతే కీలకం బంజారాహిల్స్ ఒకప్పుడు అతిపెద్ద నియోజకవర్గంగా పేరొందిన ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎన్నికలు అంటే ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్‌కు కంచుకోటగా పేరున్న ఈ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేసే లక్ష్యంతో సీనియర్ నేత దానం నాగేందర్‌ను టీఆర్‌ఎస్ పార్టీ బరిలో దింపింది. మూడునెలలుగా అంతర్గత సమావేశాలతో క్యాడర్‌ను సమీకరించుకున్న దానం నాగేందర్ ప్రచారంలో తనదైనశైలిలో దూసుకుపోతున్నారు. గతంలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం, మంత్రిగా కూడా పనిచేసిన నేపథ్యంలో తనకున్న పరిచయాలు, టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారాస్ర్తాలుగా మార్చుకొని గెలుపు కోసం కృషి చేస్తున్నారు.పాదయాత్రలు, రోడ్‌షోలతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ప్రధాన సమస్యలు పరిష్కారం : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నా టీఆర్‌ఎస్ సర్కారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ప్రధానంగా ఎంఎస్ మక్తా,ఎన్‌బీటీనగర్ బస్తీల్లో ప్రాణాంతకంగా ఉన్న హైటెన్షన్ వైర్ల సమస్యలను తొలగించడంతో ఇక్కడివారంతా కారుకే జైకొడుతున్నారు. రాష్ర్టానికే తలమానికంగా బంజారాహిల్స్ రోడ్‌నెం.12లో పోలీస్ కమాండ్ కంట్రోల్ భవనాన్నినిర్మిస్తోంది.ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ డివిజన్ల పరిధిలో డబుల్ ఇండ్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి.దీంతోపాటు నియోజకవర్గవ్యాప్తంగా వేలాదిమందికి ఆసరా పింఛన్లు అందుతున్నాయి.

Related posts

Leave a Comment