వన్ హ్యూమానిటి కేర్…వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం !!

THE NEWS INDIA(TNI 24 NEWS NETWORK)…చిత్తూర్ జిల్లా బుచ్చి నాయుడు కండ్రిగ మండలంలోని వేణుగోపాలపురం గ్రామం నందు వన్ హ్యూమానిటి కేర్ వారి చే నిర్మించబడిన కమ్యూనిటీ హాలు మరియు వాటర్ ప్లాంట్  ఆదివారం సాయంత్రం 5 గంటలకు శ్రీ కృష్ణా జి గారిచే ఘనంగా ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు డియోటీస్, పాల్గొన్నారు. కృష్ణ జి మాట్లాడుతూ ఈ మండలంలో ఉన్న గ్రామాలు అన్నిటిని  వేణుగోపాల పురం గ్రామం లాగా అందమైన గ్రామంలా మారుస్తాము అని మరియు ఈ గ్రామంలో  ఉన్న సమస్యలాన్నిటిని పూర్తిగా నిర్ములిస్తాం అని తెలిపారు.

ఈ సందర్భంగా గ్రామ కోఆర్డినేటర్ సుధాకర్ మాట్లాడుతూ వన్ హ్యూమానిటి కేర్ వారి రాకతో మా గ్రామంలోని సమస్యలు తీరి ఒక అందమైన  గ్రామంగా మారిందని హర్షం వ్యక్తం చేశారు.
అరవింద్ రెడ్డి
రాయలసీమ జోన్ ప్రతినిధి

Related posts

Leave a Comment