బోల్డ్ స్టోరీ.. ఎన్టీఆర్ అత్యుత్తమ నటన!: ‘అరవింద సమేత’పై రామ్ చరణ్

గత వారం విడుదలైన ‘అరవింద సమేత’
ఎన్టీఆర్ కెరీర్ లో అత్యుత్తమ నటన
డైలాగులు, సంగీతం బాగున్నాయన్న రామ్ చరణ్
గత వారంలో విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తున్న ‘అరవింద సమేత వీరరాఘవ’పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రశంసల వర్షం కురిపించాడు. జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ లోనే అత్యుత్తమ నటనను ప్రదర్శించాడని కితాబిచ్చాడు. బోల్డ్ స్టోరీ, అద్భుత దర్శకత్వం, మంచి డైలాగులతో త్రివిక్రమ్ శ్రీనివాస్, జగపతి బాబు నటన, థమన్ సంగీతం సినిమాను మరో మెట్టు ఎక్కించాయని అన్నాడు. పూజా హెగ్డే నటనను తాను ఆసాంతం ఆస్వాదించానని చెప్పాడు. మొత్తం టీమ్ కు అభినందనలు తెలిపాడు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.
Tags: bold story, aravindha sametha,ntr

Related posts

Leave a Comment