నరేంద్ర మోదీ గారూ! దయచేసి, తెలుగువాళ్లను ఓటు అడగకండి: సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి

తెలుగువాడిగా విజ్ఞప్తి చేస్తున్నా
ఏపీకి ప్రకటించిన ప్రత్యేక హోదా ఇవ్వండి
‘హోదా’ ఇచ్చే వరకూ ఏ తెలుగువాడిని ఓటు అడగకండి
ఏపీకి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని నరేంద్ర మోదీపై ప్రముఖ సినీనటుడు నారాయణమూర్తి మండిపడ్డారు. ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ, ‘నరేంద్ర మోదీ గారూ! తెలుగువాడిగా మీకో విజ్ఞప్తి చేస్తున్నా .. దయచేసి, కర్ణాటకలో మా తెలుగువాళ్లను ఓటు అడిగే ముందు.. ఏపీకి మీరు ప్రకటించిన ప్రత్యేక హోదా ఇవ్వండి. మా తెలుగువాళ్లందరూ మీకే ఓటు వేస్తారు. ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకూ ఏ తెలుగువాడిని దయచేసి ఓటు అడగకండి! ప్లీజ్..ప్లీజ్ ఇంప్లిమెంటిట్. ‘హోదా’ను మీరు అమలు చేయండి..మీకు చేయెత్తి నమస్కరిస్తున్నాను’ అని అన్నారు.

Related posts

Leave a Comment