కొట్టుకున్న విద్యార్థులు.. ఒకరి మృతి..

  • ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అలహాబాద్‌లో ఘటన
  • హోటల్‌లో భోజనం చేయడానికి వచ్చి గొడవ పెట్టుకున్న ఇరు వర్గాలు
  • నిందితుడి అరెస్ట్

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అలహాబాద్‌లో ఓ హోటల్‌లో విద్యార్థులు పరస్పరం ఘోరంగా దాడి చేసుకున్న ఘటన అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. ఈ ఘటనలో లా రెండో సంవత్సర విద్యార్థి ఒకరు మృతి చెందాడు. దిలీప్ అనే సదరు విద్యార్థి గత రాత్రి కాళికా హోటల్‌లో భోజనం చేసేందుకు తన స్నేహితులతో కలిసి వచ్చాడు. అదే హోటల్‌లో ఉన్న కొంత మంది యువకులకు, దిలీప్‌కి ఓ విషయంలో గొడవ చెలరేగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన ఇరు వర్గాల యువకులు హోటల్ లోని కుర్చీలు, ఇతర వస్తువులతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు విజయ్ శేఖర్ అని గుర్తించిన పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.  

Related posts

Leave a Comment