ఆగ్రహానికి గురైన ఐజీ బీఆర్‌ మీనా…

మొరాదాబాద్‌: చిన్నారులు ఆడుకుంటున్న బంతి తగలడంతో వారిపై కోపంతో విరుచుకుపడ్డాడో పోలీస్‌ అధికారి. అంతటితో ఆగకుండా ఆ చిన్నారులను అదుపులోకి తీసుకుని 6 గంటల పాటు పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

స్థానికంగా నివసించే కొందరు పిల్లలు క్రికెట్‌ ఆడుతుండగా.. ఆ బంతి మొరాదాబాద్‌ ఐజీ బీఆర్‌ మీనాకు తగిలింది. దీంతో ఆగ్రహానికి గురైన మీనా.. ఆ చిన్నారులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. ఐజీ ఆదేశాల మేరకు పోలీసులు చిన్నారులను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న చిన్నారుల తల్లిదండ్రులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో దాదాపు 6 గంటల తర్వాత పోలీసులు ఆ పిల్లలను విడిచిపెట్టారు. అయితే వారిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.

Related posts

Leave a Comment