ఆ కాలనీలు ఇంకా వరదనీటిలోనే వున్నాయి: కేసీఆర్‌కు ఉత్తమ్ లేఖ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి మునిసిపాలిటీ పరిధిలోని పలు కాలనీల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని, రెండు నెలలుగా వెయ్యి ఇళ్లు వరదనీటిలోనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉస్మాన్ నగర్, సయీఫ్ నగర్, అబ్దుల్లా యహియా నగర్ వాసులు బురద నీటి కారణంగా పలు ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఆదుకునేందుకకు ఇప్పటి వరకు అధికారులు కానీ, ప్రజా ప్రతినిధులు కానీ రాలేదని అన్నారు. అధికారులు, కలెక్టర్‌ను అడిగితే నిధులు లేవని, రాగానే పనులు చేస్తామని, ప్రభుత్వానికి నివేదికలు పంపామని చెబుతున్నారని లేఖలో ఉత్తమ్ పేర్కొన్నారు. సాక్షాత్తూ ఓ మంత్రి నియోజకవర్గంలో రెండు నెలలుగా ఇలాంటి పరిస్థితి ఉండడం దారుణమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని, వరద నీటిని బయటకు పంపే ప్రయత్నం…

Read More

ఈ రేసింగ్ పావురం పేరు ‘న్యూ కిమ్’.. ధర రూ. 14 కోట్ల పైమాటే!

ఏంటీ.. ఒక్క పావురం ఖరీదు రూ. 14 కోట్లా? అని నోరెళ్లబెట్టకండి. ఎందుకంటే ఇది నిజం. ‘న్యూ కిమ్’గా పిలిచే ఓ ఆడ రేసింగ్ పావురాన్ని చైనాకు చెందిన గుర్తు తెలియని వ్యక్తి ఏకంగా రూ. 1.6 మిలియన్ యూరోలు (భారత కరెన్సీలో దాదాపు రూ. 14.11 కోట్లు) చెల్లించి దానిని కొనుగోలు చేశాడు. బెల్జియంలోని పీజియన్ పారడైజ్ (పిపా) అనే సంస్థ నిర్వహించిన ఆన్‌లైన్ వేలంలో ఈ పావురానికి రికార్డు స్థాయి ధర పలికింది. ఓ పావురం ఇన్ని కోట్లకు అమ్ముడుపోవడం ప్రపంచ రికార్డని చెబుతున్నారు. గతేడాది ఓ మగ కపోతం ‘అర్మాండో’ 1.25 మిలియన్ యూరోలకు అమ్ముడుపోయిందని, ఇప్పుడా రికార్డును ‘న్యూ కిమ్’ బద్దలుగొట్టిందని పిపా తెలిపింది. రెండేళ్ల వయసున్న ‘న్యూ కిమ్’ను 200 యూరోల బేస్ ప్రైస్‌తో వేలానికి పెట్టగా ఏకంగా 1.6…

Read More

నేడు తొలి కార్తీక సోమవారం… శైవ క్షేత్రాలు కిటకిట!

శివ కేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీకమాసం ప్రారంభమై, నేడు తొలి సోమవారం కావడంతో, శైవక్షేత్రాలతో పాటు ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పలు దేవాలయాల్లో కరోనా నిబంధనలను అనుసరించి, భక్తులకు దర్శనాలను కల్పించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. విశ్వేశ్వరుడు కొలువైన వారణాసి, మల్లికార్జునుడు కొలువుదీరిన శ్రీశైలం, శ్రీకాళహస్తీశ్వరుడు కొలువైన కాళహస్తి, రాజరాజేశ్వరుడు కొలువైన వేములవాడతో పాటు త్రిలింగ క్షేత్రాలు, పంచారామాలు సహా అన్ని శివాలయాల్లో ఈ తెల్లవారుజాము నుంచే భక్తుల సందడి మొదలైంది. ప్రధాన దేవాలయాల్లో భక్తుల రద్దీ సాధారణ స్థాయితో పోలిస్తే తక్కువగానే ఉంది. ముందుగా అనుమతి తీసుకున్న భక్తులను, వీఐపీలనూ అనుమతిస్తుండగా, చిన్న దేవాలయాల్లో కొవిడ్ నిబంధనలు కనిపించడం లేదని తెలుస్తోంది. అన్ని దేవాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని సముద్ర తీరంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు సమీప ప్రాంతాల ప్రజలు తరలివచ్చారు.…

Read More

హీరోగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న ఎన్టీఆర్.. అభిమానుల హడావిడి!

NTR who has completed 20 years as a hero

యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ హీరోగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో ఆయనకు అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఫొటోలు, కామన్ డీపీను అభిమానులు #2DecadesOfNTREra పేరుతో పోస్ట్ చేస్తున్నారు. నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్.. ఆ తర్వాత స్టూడెంట్ నం.1, ఆది, సింహాద్రి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. యమదొంగ, అదుర్స్, బృందావనం, బాద్షా, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వంటి సినిమాలతో టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరిగా వెలుగొందుతున్నాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు.

Read More