చంద్ర‌బాబు,రాధాకృష్ణ మొహాల్లో ఓట‌మి భ‌యం : జ‌గ‌న్

.   THE NEWS INDIA …  ఏపి ఎన్నిక‌ల ప్ర‌చార వేళ‌..జ‌గ‌న్ త‌న సర‌ళి మార్చారు. ఇప్పటి వ‌ర‌కు చంద్ర‌బాబును ల‌క్ష్యంగా చేసుకొని ఎన్నిక‌ల ప్ర చారం సాగించిన జ‌గ‌న్…ఇక‌, టిడిపి మ‌ద్ద‌తుగా నిలుస్తున్న మీడియా ద్వారా న‌ష్టం జ‌రుగుతుంద‌ని అంచ‌నా కు వ‌చ్చా రు. దీంతో..ఇక ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఎల్లో మీడియా అంటూ మాత్ర‌మే విమ‌ర్శ‌లు చేసిన జ‌గ‌న్ ఇప్పుడు నేరుగా ప‌త్రిక‌ల పేర్లు..వాటి అధినేత పేర్లు మ‌రీ చెబుతూ కార్న‌ర్ చేస్తున్నారు..

Read More

జనంలేక వెలవెలబోయిన రాజ్ నాథ్ సభ…

న్యూస్ ఇండియా24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్ కృష్ణా జిల్లా అవనిగడ్డలో బీజేపీ సభ హాజరయ్యేందుకు విముఖత చూపిన స్థానికులు టీడీపీపై విమర్శలు చేసిన కేంద్ర హోం మంత్రి కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా అవనిగడ్డలో కాలుమోపారు. అయితే, బీజేపీ అధినాయకత్వంలో నంబర్.3 గా వెలుగొందుతున్న రాజ్ నాథ్ కు అవనిగడ్డలో నిరాశ తప్పలేదు. ఆయన సభ జనంలేక వెలవెల పోయింది. టీడీపీ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఈ జిల్లాలో బీజేపీ అగ్రనేత చెప్పే మాటలు వినడానికి ఎవరూ ఆసక్తిచూపించలేదు. అయితే, తన సభలో ఆద్యంతం టీడీపీపై విమర్శలు చేయడానికే ప్రాధాన్యత ఇచ్చారు రాజ్ నాథ్ సింగ్. ఐదేళ్ల పాలనలో టీడీపీ ప్రభుత్వం ప్రజల కళ్లల్లో మట్టికొట్టిందని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా తాము ప్రత్యేక శ్రద్ధ…

Read More

మోహన్ బాబుకు బెదిరింపు ఫోన్ కాల్స్…

న్యూస్ ఇండియా24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్…ప్రముఖ సినీనటుడు మోహన్ బాబు ఇటీవలే వైసీపీలో చేరారు. అయితే, వైసీపీలో తాను చేరినప్పటి నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ మోహన్ బాబు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆయన ఫిర్యాదు చేశారు. గత నెల 26న తన ఫోన్ నెంబర్ కు ఈ బెదిరింపు కాల్స్ వచ్చినట్టు ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. ఈ బెదిరింపు కాల్స్ విదేశాల నుంచి మోహన్ బాబుకు వచ్చినట్టుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసినట్టు సమాచారం.

Read More

నా విగ్రహానికే ఎందుకు?: ప్రశ్నించిన మాయావతి

న్యూస్ ఇండియా24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్..  * స్మారక చిహ్నాలు, విగ్రహాలు ఏర్పాటు చేయడం దేశంలో కొత్తకాదు *  వేల కోట్ల రూపాయలను వాటికోసం వెచ్చిస్తున్నారు  * దళిత మహిళకు దక్కిన గౌరవం చూసి జీర్ణించుకోలేకపోతున్నారు మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దళిత నేతల పక్కన తన విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్‌పై బీఎస్పీ చీఫ్ మాయావతి స్పందించారు. తన విగ్రహాలను పెట్టుకుంటే వారికి వచ్చే ఇబ్బందేమిటో తనకు అర్థం కావడం లేదన్నారు. ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారో తనకు తెలియదన్నారు. అయోధ్యలో 221 మీటర్ల రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని చెబుతున్నప్పుడు లేని అభ్యంతరాలు తనకు మాత్రమే ఎందుకని మాయావతి ప్రశ్నించారు. సుప్రీంకోర్టుకు మాయావతి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. ‘‘స్మారక చిహ్నాలు ఏర్పాటు చేయడం, విగ్రహాలు ప్రతిష్ఠించడం ఈ దేశంలో కొత్తకాదు. కాంగ్రెస్ హయాంలో…

Read More