సంక్రాంతి సందడి ..పౌరుషం చూపేందుకు రెడీ అవుతున్న పందెం కోళ్లు!

   న్యూస్ ఇండియా న్యూస్ నెట్వర్క్…సంక్రాంతి పేరు చెబితే, వెంటనే గుర్తొచ్చేది కోడి పందాలే. అనుమతి ఉన్నా, లేకున్నా, ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి రక్తం చిందకుండా పండగ జరగదు. ప్రజా ప్రతినిధులు ఈ మూడు రోజుల పందాలను ఎంత వైభవంగా నిర్వహిస్తే, ప్రజల్లో అంత పరపతి పెరుగుతుందని కూడా నమ్ముతుంటారు. పోలీసులు అడ్డుకుంటున్నా, తమపైన శైలిలో వారిపై ఒత్తిడి తెచ్చి, పెట్టే కేసులను మమ అనిపించేస్తారు. ఇక ఈ సంవత్సరం దాదాపు 20 వేలకు పైగా కోళ్లు పందెంబరిలోకి దిగి తమలోని పౌరుషాన్ని ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది. ఏలూరు, భీమవరం, అనకాపల్లి, పాలకొల్లు, నరసాపురం, కాకినాడ, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో గత మూడు నెలల నుంచి పందెం కోళ్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పూర్తయిన కోడి ధర, జాతిని, పుట్టిన నక్షత్రాన్ని బట్టి…

Read More