కేటీఆర్ రోడ్ షోలో ఉద్రిక్తత.. మాగంటి గోపీనాథ్, సతీష్ రెడ్డిల మధ్య తీవ్ర వాగ్వాదం

THE NEWS INDIA(TNI 24/7 NEWS NETWORK)….గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరధిలోని యూసుఫ్ గూడలో ఆయన రోడ్ షో నిర్వహిస్తున్న సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్, టీఆర్ఎస్ నాయకుడు సతీష్ రెడ్డిల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, సతీష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయబోయారు. అయితే, మేయర్ బొంతు రామ్మోహన్ సర్దిచెప్పడంతో, వివాదం సద్దుమణిగింది. 

Read More

మాదిగల సంపూర్ణ మద్దతు మహాకూటమికే: మంద కృష్ణ

THE NEWS INDIA (TNI 24/7 NEWS NETWORK)….కేసీఆర్ నిరంకుశ పాలనను పారదోలేందుకు మహాకూటమికి మాదిగల సంపూర్ణ మద్దతు ఉంటుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ తెలిపారు. మాదిగల మద్దతు కావాలని కాంగ్రెస్ కోరిందని… భాగస్వామ్యపక్షాలతో కలసి కూటమి విజయానికి కృషి చేస్తామని చెప్పారు. మరోవైపు, ఎస్సీ వర్గీకరణ అంశాన్ని మహాకూటమి మేనిఫెస్టోలో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మహాకూటమి అధికారంలోకి వస్తే మాదిగలకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించాలని కోరారు. ఆయన డిమాండ్లకు కూటమి నేతలు సానుకూలంగా స్పందించడంతో… మహాకూటమికి ఆయన సంపూర్ణ మద్దతును ప్రకటించారు.

Read More

మేరా హైదరాబాద్ ! హమారా హైదరాబాద్ !! నినాదంతో సీమాంధ్రుల ఐక్యవేదిక పనిచేస్తుంది… సంగినీడి

. తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత జీవనోపాధి సాగిస్తున్న కోటి మంది సీమాంధ్రుల పరిరక్షణకు ,సీమాంధ్రుల అభ్యున్నతికి ,వారి హక్కుల కోసం  నిరంతరం  సీమాంధ్రుల ఐక్యవేదిక  అండగా నిలుస్తుందని ,మేరా హైదరాబాద్ ! హమారా హైదరాబాద్ !! నినాదంతో సీమాంధ్రుల ఐక్యవేదిక పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రభుత్వ పథకాలు సీమాంధ్రులకు చేరే విధంగా కృషి చేయడం జరిగిందన్నారు , నానాకరామ్ గూడా భవనం కూలిన ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకునే విధంగా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొచ్చి వారికి న్యాయం చేయడం జరిగింది. సీమాంధ్రుల హక్కులను పరిరక్షిస్తామని చెబుతూన్న కొన్ని రాజకీయపార్టీలు, వారి మనోభావాలు దెబ్బతినే విధంగా ఆంధ్ర , ఆంధ్రోళ్లు అనే వ్యతిరేక భావన సృష్టించబడుతు తప్పుడు సంకేతాలు ఇస్తున్నట్లు అనిపిస్తుందని, మేము భారత పౌరులం,తెలుగువాళ్ళం, తెలంగాణ వేరు ఆంధ్ర వేరు అనే భావన…

Read More