మెదక్ అభివృద్ధి బాధ్యత నాదే….

న్యూస్ ఇండియా పొలిటికల్ డెస్క్…..జూన్‌నాటికి జిల్లాకు కాళేశ్వరం నీళ్లు -365 రోజులూ నిండుగా మంజీర, హల్దీ -కేసీఆర్ వల్లే జిల్లా అయిన మెదక్ -పద్మకు మంచి ఉన్నత స్థానం రావాలి -మెదక్ ఎన్నికల సభలో సీఎం కేసీఆర్ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కాళేశ్వరం పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని, వచ్చే ఏడాది జూన్ తర్వాత మెదక్‌కు కాళేశ్వరం నీళ్లు వస్తాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. ఒక్కసారి కాళేశ్వరం నీళ్లు రావడం మొదలైతే.. మన హల్దీవాగు ఎన్నడూ ఎండిపోదన్నారు. మంజీరమీద 14 చెక్‌డ్యాంలు, హల్దీవాగు మీద మరిన్ని చెక్‌డ్యాంలు మంజూరు చేసుకున్నామని, కాళేశ్వరం నీళ్లు వస్తే 365 రోజులు మంజీరా, హల్దీవాగుల్లో నీళ్లు ఎండిపోవని చెప్పారు. మన ప్రాంతమంతా తూర్పు గోదావరి డెల్టా కంటే బ్రహ్మాండంగా మారుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ ఎన్నికల్లో పద్మాదేవేందర్‌రెడ్డిని మళ్లీ గెలిపిస్తే.. ఉన్నతమైన…

Read More

తెలంగాణపై చంద్రబాబు కన్నుపడింది: ఎంపీ కవిత…

 న్యూస్ ఇండియా పొలిటికల్ డెస్క్…తెలంగాణపై  ఏపీ సీఎం చంద్రబాబు కన్నుపడిందని నిజామాబాద్‌ ఎంపీ కవిత అన్నా రు. బుధవారం జగిత్యాల జిల్లా రాయికల్‌ ప్రచారంలో ఆమె మాట్లాడుతూ.. మామ ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, మహా కూటమితో రాష్ట్రంలో అడుగుపెట్టేందుకు ప్రయ త్నిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని జలవనరులను ఆంధ్రాకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్‌ నేతలతో కలసి కుట్ర పన్నుతున్నారన్నారు. కూటమికి ప్రజలంతా ఓట్లతో బుద్ధిచెప్పి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Read More

ఆంధ్రా పాలకుల వల్ల తెలంగాణకు అన్యాయం..

ది న్యూస్ ఇండియా పొలిటికల్ డెస్క్… *ప్రజలు ఆలోచించాల్సిన సమయం వచ్చింది ప్రచారంలో భూపాలపల్లి టీఆర్‌ఎస్ అభ్యర్థి, *మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి తెలంగాణ ప్రాంతం ఆంధ్రా పాలకుల వల్ల అన్యాయానికి గురవుతోందని అందుకే మన పాలన మనకే కావాలని పోరాడి తెలంగాణ ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకున్నామని మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. మొగుళ్లపల్లి మండలంలోని ములుకలపల్లి, కొర్కిశాల, పోతుగల్లు, ఇప్పలపల్లి, పెద్దకోమటిపల్లి, పర్లపల్లి, గణేశ్‌పల్లి గ్రామాల్లో భూపాలపల్లి నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిరికొండ మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాక తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. కేసీఆర్ పాలనను ఇతర దేశాలు, రాష్ర్టాలు ప్రశంసిస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో అనేక పార్టీల నాయకులు మాయ మాటలు చెప్పి ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని, వారి…

Read More

రూ.29,088 కోట్ల పరోక్ష పన్ను ఎగవేతలు..

 న్యూస్ ఇండియా బిజినెస్ డెస్క్….న్యూఢిల్లీ,.. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన దర్యాప్తు విభాగం పెద్ద ఎత్తున పరోక్ష పన్ను ఎగవేతల్ని గుర్తించింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-అక్టోబర్ వ్యవధిలో 1,835 కేసుల్లో రూ.29,088 కోట్ల పన్ను ఎగవేతలు జరిగినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటిలిజెన్స్ (డీజీజీఐ) కనుగొన్నది. వీటిలో రూ.4,562 కోట్ల విలువైన 571 జీఎస్టీ ఎగవేత కేసులు కూడా ఉన్నాయి. రూ.1,553 కోట్ల విలువైన మరో 119 సెంట్రల్ ఎక్సైజ్ సుంకం కేసుల్నీ డీజీజీఐ వెలుగులోకి తెచ్చింది. ఈ మేరకు బుధవారం ఓ సీనియర్ అధికారి పీటీఐకి తెలిపారు. కాగా, అత్యధికంగా సేవా పన్నుల కేసులే ఉండగా, 1,145 కేసుల్లో రూ.22,973 కోట్ల ఎగవేతలున్నాయి. పరోక్ష పన్నులు, కస్టమ్స్ కేంద్ర బోర్డు (సీబీఐసీ)కు చెందిన క్షేత్రస్థాయి కార్యాలయాల్లో నమోదైన మరికొన్ని కేసుల వివరాలనూ…

Read More