ఈ రేసింగ్ పావురం పేరు ‘న్యూ కిమ్’.. ధర రూ. 14 కోట్ల పైమాటే!

ఏంటీ.. ఒక్క పావురం ఖరీదు రూ. 14 కోట్లా? అని నోరెళ్లబెట్టకండి. ఎందుకంటే ఇది నిజం. ‘న్యూ కిమ్’గా పిలిచే ఓ ఆడ రేసింగ్ పావురాన్ని చైనాకు చెందిన గుర్తు తెలియని వ్యక్తి ఏకంగా రూ. 1.6 మిలియన్ యూరోలు (భారత కరెన్సీలో దాదాపు రూ. 14.11 కోట్లు) చెల్లించి దానిని కొనుగోలు చేశాడు. బెల్జియంలోని పీజియన్ పారడైజ్ (పిపా) అనే సంస్థ నిర్వహించిన ఆన్‌లైన్ వేలంలో ఈ పావురానికి రికార్డు స్థాయి ధర పలికింది. ఓ పావురం ఇన్ని కోట్లకు అమ్ముడుపోవడం ప్రపంచ రికార్డని చెబుతున్నారు. గతేడాది ఓ మగ కపోతం ‘అర్మాండో’ 1.25 మిలియన్ యూరోలకు అమ్ముడుపోయిందని, ఇప్పుడా రికార్డును ‘న్యూ కిమ్’ బద్దలుగొట్టిందని పిపా తెలిపింది. రెండేళ్ల వయసున్న ‘న్యూ కిమ్’ను 200 యూరోల బేస్ ప్రైస్‌తో వేలానికి పెట్టగా ఏకంగా 1.6…

Read More

లగ్జరీ కార్ల తయారీదారు లాంబోర్ఘినీ ఏపీలో అడుగుపెడుతోంది: విజయసాయిరెడ్డి

ఇటలీకి చెందిన విలాసవంతమైన స్పోర్ట్స్ కార్ల తయారీదారు లాంబోర్ఘినీ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఏపీలో మరో మెగా పెట్టుబడి అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఏపీలో విద్యుత్ ఆధారిత వాహనాలు తయారుచేసేందుకు లాంబోర్ఘినీ ఆసక్తి చూపుతోందని, రూ.1,750 కోట్ల మేర పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉందని వివరించారు. భారత్ లో పెట్టుబడులకు అత్యంత అనువైన రాష్ట్రంగా ఏపీ పేరు తెచ్చుకుంటోందని, సీఎం జగన్ నాయకత్వంలో రాష్ట్రం ముందుకు పోతోందని కొనియాడారు. లాంబోర్ఘినీ ఓ ప్రపంచస్థాయి కార్ల తయారీ దిగ్గజం. ఈ సంస్థ తయారుచేసిన పలు మోడళ్లు రూ.3 కోట్ల పైచిలుకు ధర పలుకుతున్నాయి. భారత్ లోనూ అనేకమంది సినీ స్టార్లు లాంబోర్ఘినీ కారు కొనడాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారంటే అతిశయోక్తి కాదు.

Read More

ఇండియాలో నంబర్ వన్ ఓటీటీ ఏది?

Which is the best one OTT in India

ఒకప్పుడు కొత్త సినిమా అంటే థియేటర్లలో మాత్రమే రిలీజయ్యేది. కానీ ఇప్పుడు నేరుగా మన ఇంట్లోని టీవీలో విడుదలైపోతోంది. ఈ విప్లవానికి కారణం ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్. ఇంతకుముందు ఇవి కొత్త సినిమాలు రిలీజైన నెల నుంచి రెండు మూడు నెలల మధ్య కొత్త సినిమాలను విడుదల చేసేవి. కానీ కరోనా ధాటికి థియేటర్లు మూతపడ్డ గత ఆరేడు నెలల్లో కొత్త సినిమాలను నేరుగా రిలీజ్ చేసి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచాయి. ఈ క్రమంలో వీటికి అనూహ్యమైన ఆదరణ లభించింది. సబ్‌స్క్రైబర్లు భారీగా పెరిగారు. ఆహా లాంటి లోకల్ యాప్ సైతం సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ క్రమంలో ఇండియాలో అత్యధికంగా ఆదరణ పొందుతున్న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఏది.. దేనికి అధిక స్థాయిలో సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.. వీటిలో ఏది నంబర్ వన్ అన్న ప్రశ్నలు…

Read More

మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

న్యూస్ ఇండియా24/7 న్యూస్ నెట్వర్క్…. వివిధ మార్కెట్లలో బుధవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.34,920, విజయవాడలో రూ.34,420, విశాఖపట్నంలో రూ.34,920, ప్రొద్దుటూరులో రూ.34,400, చెన్నైలో రూ.33,730గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.32,330, విజయవాడలో రూ.31,900, విశాఖపట్నంలో రూ.32,120, ప్రొద్దుటూరులో రూ.31,840, చెన్నైలో రూ.32,260గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.41,800, విజయవాడలో రూ.42,000, విశాఖపట్నంలో రూ.41,900, ప్రొద్దుటూరులో రూ.41,800, చెన్నైలో రూ.44,100 వద్ద ముగిసింది.

Read More