‘ఆర్ ఆర్ ఆర్’ నుంచి కొత్త పోస్టర్ .. దెబ్బతిన్న సింహంలా ఎన్టీఆర్!

0 15,477

రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ ఆర్ ఆర్’ నుంచి ఒక్కో అప్ డేట్ ను వదులుతూ వెళుతున్నారు. వచ్చిన ప్రతి అప్ డేట్ .. సినిమాపై అంతకంతకూ అంచనాలు పెంచుతూ వెళుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి కొమరం భీమ్ గా ఎన్టీఆర్ పోస్టర్ ను వదిలారు. ఆంగ్లేయులచే శిక్షించబడినట్టుగా ఆయన శరీరం రక్తసిక్తమై కనిపిస్తోంది.

దేహంపై రక్తం ధారలు కట్టినా .. ఆయన కళ్లలో తెగింపే తప్ప భయం కనిపించడం లేదు. దెబ్బ తిన్న సింహంలా ఈ పోస్టర్లో ఆయన కనిపిస్తున్నాడు. ఉప్పొంగుతున్న ఆవేశానికి .. ఉరకలేస్తున్న ఆశయానికి ఆహారంగా బానిసత్వాన్ని సమర్పించాలనే బలమైన నిర్ణయానికి వచ్చినట్టుగా అనిపిస్తున్నాడు.

ఇక ఈ రోజు సాయంత్రంలోగా చరణ్ .. అల్లూరి సీతారామరాజు లుక్ కూడా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన లిరికల్ వీడియో సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 9వ తేదీన ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా సినిమాను వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు.
Tags: Junior NTR, Ramcharan, Alia Bhatt, RRR Movie

Get real time updates directly on you device, subscribe now.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy