మహాకూటమిలో చేరిన మరో పార్టీ

రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా మహాకూటమి ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ కూటమిలో ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ లు భాగస్వాములుగా ఉన్నాయి. తాజాగా ఈ కూటమిలోకి మరో పార్టీ వచ్చి చేరింది. ‘తెలంగాణ ఇంటి పార్టీ’ మహాకూటమితో చేతులు కలిపింది. ఈ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ నిన్న కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో భేటీ అయ్యారు. మహాకూటమికి మద్దతు పలుకుతున్నట్టు తెలిపారు. కూటమిలో చేరుతున్నందున తమ పార్టీకి కేటాయించాల్సిన స్థానాలపై చర్చించారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ, ఈ విషయాన్ని పార్టీ దృష్టికి తీసుకెళతామని సుధాకర్ కు హామీ ఇచ్చారు.

Read More