తని ఒరువన్ దర్శకుడితో రామ్ చరణ్ పాన్ ఇండియా ఫిలిం?

ఇటీవలి కాలంలో తెలుగు సినిమా స్థాయి బాగా పెరిగింది. ‘బాహుబలి’ సినిమా నుంచి ఇది బాగా ఎక్కువైంది. తెలుగు స్టార్ హీరోల సినిమాలకు బాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ఏర్పడడంతో పలువురు హీరోలు తమ సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రభాస్ సినిమాలన్నీ ఆ స్థాయిలోనే నిర్మాణం అవుతున్నాయి. ఆ తర్వాత మహేశ్, ఎన్టీఆర్ సినిమాలు కూడా మెల్లగా పాన్ ఇండియా సినిమాలుగా రూపాంతరం చెందుతున్నాయి. ఈ కోవలో మెగాస్టార్ వారసుడు రామ్ చరణ్ కూడా ఇకపై తన సినిమాలను పాన్ ఇండియా స్థాయి చిత్రాలుగా నిర్మాణం జరపడానికి సమాయత్తమవుతున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తాను చేయబోయే సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఉండాలన్న ఉద్దేశంతో అలాంటి కథ కోసం, దానిని సరిగా డీల్ చేయగల దర్శకుడి కోసం ఆయన చూస్తున్నాడు. ఈ…

Read More