రాజ్ న్యూస్ ఛైర్మెన్ గా రవిబాబు కు ఊస్టింగ్ ?

రాజ్ న్యూస్ ఛైర్మెన్ గా రవిబాబు కు ఊస్టింగ్ రాజ్ న్యూస్ తెలుగు టేకోవర్ చేసిన బిజెపి నేత నరోత్తం రెడ్డి ఛానల్ మేనేజ్మెంట్ తో కొత్త అగ్రిమెంట్ చేసుకున్నారని తెలిసింది. రవిప్రకాష్ చైర్మన్ గా చెన్నైలోని యాజమాన్యం చేసిన అగ్రిమెంట్ పై బీజేపీ, నరోత్తం రెడ్డిల సీరియస్ అబ్జెక్ష‌న్‌ రైజ్ చేసినట్లు భోగట్టా. పెట్టుబడి పెట్టింది తామైతే, అగ్రిమెంట్లో రవిప్రకాష్ చైర్మన్ గా ఎలా ఉంటాడాని నరోత్తంరెడ్డి సీరియస్సయ్యిండట. కొత్త చైర్మన్ గా తమ తరుపున మరో వ్యక్తితో యాజమాన్యంతో మరో ఒప్పందానికి బీజేపీ నాయకులు రంగం సిద్ధం చేశారు. నేడో రేపో ఈ దిశలో అగ్రిమెంట్ ఖాయం కావచ్చని కమలం పార్టీ లోని కట్టర్ సంఘ్ కార్యకర్తలు చెబుతున్నారు. గతంలో హిందూత్వ వాదులపై రవిప్రకాష్ ఓవర్ యాక్షన్ మీద సంఘ్ సానుభూతిపరులు కోపంగా ఉన్నారు.…

Read More

తన గోతిలో తనే పడ్డ హల్వారాజ్ !!!

అనుకున్నాదోకటి, అయ్యిందోకటి..! తన గోతిలో తనే పడ్డ హల్వారాజ్ !!! అయిపోయింది..అంతా అయిపోయింది… ఏం జరక్కూడదని రవిబాబు అండ్ కో., అనుకున్నారో అదే అయ్యింది. భయ్యా రాజ్ న్యూస్ కి ఎంట్రీ ఇస్తారని, ఇక మెరుగైన సమాజ స్థాపన పార్ట్ 2 ఖాయమని రవిబాబు అలియాస్ ప్రకాష్ బాబు అభిమానులు కం కార్యకర్తలు ఆ-వే-శించారు. ఇటు ఫ్లవర్ గుర్తు కట్టర్ క్యాడర్ లో ఒక వర్గం కూడా రవిప్రకాష్ వచ్చి తెలంగాణా సీఎం కు చానెల్ ద్వారా చుచ్చు పోయిస్తాడని ఆశలు పెట్టుకున్నారు. రవన్నను ఛానెల్ కి రమ్మనే నంబర్ కంటే ఆంధ్ర కమ్మ-నిస్ట్ వాసనలున్న ప్రకాశంబాబు రావడం వ్యతిరేకించే వారే సంఘ్ మీడియా వింగ్ లో ఎక్కువని పువ్వు పార్టీ వర్గాలంటున్నాయి. అపశకునాలన్నింటిని దాటి అమావాస్య అర్ధరాత్రి స్టూడియో చూసుకెళ్లిన రవి ప్రకాశం బాబు…. మెల్లిమెల్లిగా…

Read More

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డెక్కిన కాంగ్రెస్, జనసేన నేతలు, పలువురి అరెస్ట్!

bharat bund,telugu states 2018,janasena party,congress

భారత బంద్ కు విపక్షాల మద్దతు పలు డిపోల ఎదుట నేతల బైఠాయింపు సాధారణ జనజీవనానికి ఆటంకాలు పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ‘భారత్ బంద్’ పిలుపునకు పలు విపక్ష పార్టీలు మద్దతు పలకడంతో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వాహనాలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో వివిధ పార్టీల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కడప ఆర్టీసీ బస్టాండ్ ఎదుట కాంగ్రెస్, జనసేన, వామపక్షాలు ధర్నా నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, పెరుగుతున్న ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయని, పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేశాయి. విజయవాడలో పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద తెల్లవారుజామునుంచే విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఆర్టీసీ సంఘాలు సైతం బంద్ కు మద్దతు తెలపడంతో…

Read More

కన్నడనాట బీజేపీకి భంగపాటు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయభేరి!

latest kannada ,local political ,news,congress,bjp,election

కర్ణాటకలో గత నెల 31న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బోల్తా పడింది. కాంగ్రెస్ విజయ దుందుభి మోగించింది. ఆగస్టు 31న రాష్ట్రంలోని 29 మునిసిపల్ కౌన్సిళ్లు, 3 నగర కార్పొరేషన్లు, 50 మునిసిపాలిటీలు, 20 పట్టణ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. సోమవారం ఫలితాలు వెల్లడించారు. కాంగ్రెస్‌ 982 వార్డులను కైవసం చేసుకోగా, బీజేపీ 929 స్థానాల్లో గెలిచి రెండో స్థానానికి పరిమితమైంది. 375 వార్డులతో జేడీఎస్ మూడో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ గెలుపుతో బీజేపీ నేతలు డీలా పడ్డారు. ఫలితాలు ఆశించినట్టుగా లేవని బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప పేర్కొన్నారు. మరోవైపు, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ వేర్వేరుగా పోటీ చేశాయి. అయినప్పటికీ కాంగ్రెస్‌కు అత్యధిక స్థానాలు రావడంతో బీజేపీలో కలవరం మొదలైంది. మున్ముందు లోక్‌సభ ఎన్నికలు ఉండడంతో ఇదే సీన్ ఎక్కడ…

Read More