జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ పర్వం నిన్న మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. దీంతో చివరగా ‘గ్రేటర్’ బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలను ఎన్నికల అధికారులు ప్రకటించారు. మొత్తం 2,900 మందికిపైగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, స్క్రూటినీ, ఉపసంహరణ అనంతరం 1,121 మంది అభ్యర్థులు పోటీలో నిలిచినట్టు అధికారులు తెలిపారు. అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దాదాపుగా మొత్తం 150 డివిజన్లలోనూ తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి. టీడీపీ నుంచి 105 మంది, ఎంఐఎం నుంచి 50 మంది పోటీలో ఉండగా, ఇతర పార్టీలు, స్వతంత్రులు 500 మందికిపైగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. Tags: GHMC Elections, Hyderabad, TRS Congress, BJP TDP
Read Moreపేదవాడి నాణ్యమైన చికిత్సకు ఎందుకు మంగళం పాడుతున్నారు?: దేవినేని ఉమ
ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్) స్ఫూర్తిని వైసీపీ ప్రభుత్వం నీరు గారుస్తోందంటూ ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఓ కథనాన్ని పోస్ట్ చేస్తూ టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. సీఎంఆర్ఎఫ్కు ప్రతి నెలా దాతల నుంచి విరాళాల రూపంలో రూ.25-30 కోట్ల వరకూ వస్తుందని ఆంధ్రజ్యోతిలో పేర్కొన్నారు. ఇక ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ను నిర్వీర్యం చేసే ఉద్దేశంతోనే ఆరోగ్యశ్రీతో లింక్ పెట్టిందని చెప్పారు. సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తులు తగ్గించడం వల్ల విరాళాలు కూడా చాలావరకూ తగ్గిపోతాయని పేర్కొన్నారు. వీటిని ప్రస్తావిస్తూ జగన్ సర్కారుని దేవినేని ఉమ నిలదీశారు. ‘వైసీపీ అధికారంలోకొచ్చిన నాటినుండే సీఎంఆర్ఎఫ్కు గ్రహణం.. సిఫార్సులు పంపొద్దన్న సర్కార్. 2,434 శస్త్రచికిత్సలకు వర్తించని సాయం. ప్రతిఒక్క సిఫార్సుకు ఇచ్చినా నెలకు రూ.25 కోట్లే, ప్రతినెలా దాతల విరాళాలు 25 నుంచి 30 కోట్ల రూపాయలు. అయినా పేదవాడి నాణ్యమైన చికిత్సకు…
Read Moreకుక్క ఎవరిదో తేల్చేందుకు.. డీఎన్ఏ టెస్ట్ చేయించనున్న పోలీసులు
వారసత్వం విషయంలో విభేదాలు వచ్చిప్పుడు చాలా అరుదుగా మనుషులకి డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తుంటారు. అయితే, ఓ కుక్క విషయంలో విభేదాలు వచ్చి దానికి డీఎన్ఏ పరీక్ష చేయించనున్న తమాషా ఘటన మధ్యప్రదేశ్లోని హోసంగాబాద్లో చోటు చేసుకుంది. ఓ కుక్కను నాదంటే నాది అంటూ ఇద్దరు వ్యక్తులు గొడవ పడ్డారు. చివరకు ఈ వివాదాన్ని పరిష్కరించడం కోసం డీఎన్ఏ పరీక్ష చేయడానికి నిర్ణయించారు. సాహెబ్ ఖాన్ అనే వ్యక్తి ఓ కుక్కను సొంత కుటుంబ సభ్యుడిలా చూసుకుంటూ పెంచుతున్నాడు. అయితే, ఆ కుక్క కనపడకుండా పోయింది. గత కొన్నిరోజులుగా అది కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు, కార్తిక్ శివ్హారే అనే ఏబీవీపీ నేతకు చెందిన కుక్క కూడా కనపడట్లేదు. ఆయన కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెండు కుక్కలను పోలీసులు వెతకడం ప్రారంభించగా ఒక కుక్క…
Read Moreఅల్లూరి సీతారామరాజు అనుచరుడు బాలుదొర కన్నుమూత!
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజును తన కళ్లతో చూసి, ఆయనకు సేవలందించిన శతాధిక వృద్దుడు బీరబోయిన బాలుదొర కన్నుమూశారు. తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం కొండపల్లి గ్రామానికి చెందిన ఆయన వయసు 111 సంవత్సరాలు. వయసు మీదపడిన కారణంగా వచ్చిన అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా మంచానికే పరిమితమైన ఆయన, ఆదివారం నాడు మరణించారు. 1924లో అల్లూరి సీతారామరాజు బ్రిటీష్ వారిపై పోరాటం జరుపుతున్న సమయంలో బాలుదొర బాలుడిగా ఉండేవారు. అప్పట్లో తాను ఎత్తయిన కొండలపై ఉన్న అల్లూరి సీతారామరాజుకి, ఆయన అనుచరులకు ఆహార పదార్థాలను తీసుకుని వెళ్లి అందించేవాడినని, ఆయన్ను దగ్గరగా చూసే భాగ్యం తనకు లభించడం పూర్వజన్మ సుకృతమని, నాటి ఘటనలను బాలుదొర ఎంతో మందితో పంచుకునేవారు. ఆయన మరణవార్తను గురించి తెలుసుకున్న చుట్టుపక్కల వారు నివాళులు అర్పించేందుకు కొండపల్లికి తరలివచ్చారు. Tags:…
Read More