న్యాయం చేయాలంటూ బీజేపీ నేత కిషన్ రెడ్డి భార్య ఆధ్వర్యంలో రాస్తారోకో

బీజేపీ నేత కిషన్ రెడ్డి ఇంటి వద్ద విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ పేలిన సంఘటనలో ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈరోజు ఉదయం బర్కత్ పురాలో ఈ సంఘటన జరిగింది. ట్రాన్స్ ఫార్మర్ పేలిన సమయంలో దాని భాగాలు చెల్లాచెదురుగా పడటంతో సమీపంలోనే ఉన్న శ్రీనాథ్(18) గాయాల పాలయ్యాడు. ఎనభై శాతం శరీరం కాలిపోయింది. దీంతో, క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా, బాధితుడికి న్యాయం చేయాలంటూ బీజేపీ నేత కిషన్ రెడ్డి భార్య ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. పోలీసులు నచ్చచెప్పడంతో వారు ఆందోళన విరమించారు.

Related posts

Leave a Comment