ఏపీ స‌చివాల‌య మ‌హిళా ఉద్యోగుల‌కు రేపు సెల‌వు

ఏపీ స‌చివాల‌య మ‌హిళా ఉద్యోగుల‌కు రేపు ప్రభుత్వం ప్రత్యేక సెల‌వు ప్రక‌టించింది. వెల‌గ‌పూడిలోని తాత్కాలిక స‌చివాల‌య సంద‌ర్శన‌కు మూడు రోజులు ప్రత్యేక సెల‌వులు ఇవ్వాల‌ని గ‌తంలోనే ప్రభుత్వం నిర్ణయించింది. దీంట్లో భాగంగా స‌చివాల‌య మ‌హిళా సంఘం ఇచ్చిన విన‌తి మేర‌కు రేపు సెల‌వు మంజూరు చేసింది. అయితే రేపు వెల‌గ‌పూడి వెళ్లే ఉద్యోగుల‌కు టీఏ, డీఏలు ఇచ్చేది లేద‌ని స్పష్టం చేసింది. వ‌చ్చే నెల 27నుంచి ఉద్యోగుల‌ను అమ‌రావ‌తికి త‌ర‌లించ‌డంలో భాగంగా ప్రభుత్వం ప్రత్యేక అనుమ‌తులు మంజూరు చేస్తోంది.

Related posts

Leave a Comment