శ్రీ చైతన్య స్కూల్ పై పీడీఎస్ యూ దాడి… సూర్యాపేటలో ఉద్రిక్తత

తెలుగు రాష్ట్రాల్లో అగ్రశ్రేణి కార్పొరేట్ విద్యా సంస్థగా పేరొందిన శ్రీచైతన్య స్కూల్ పై విద్యార్థి సంఘం పీడీఎస్ యూ నేతలు కొద్దిసేపటి క్రితం దాడికి దిగారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటలోని స్కూల్ పై దాడికి దిగిన పీడీఎస్ యూ నేతలు స్కూల్ లోని ఫర్నీచర్ పై ప్రతాపం చూపారు. ఇటీవల తెలంగాణ విద్యా శాఖ విడుదల చేసిన టెన్త్ ఫలితాల్లో ఈ స్కూల్ లో విద్యనభ్యసించిన 50 మంది విద్యార్థుల ఫలితాలు విత్ హెల్డ్ లో పడ్డాయి. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తమ పిల్లల ఫలితాలు వెల్లడి కాలేదని ఆరోపిస్తూ బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు నేటి ఉదయం స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పీడీఎస్ యూ నేతలు అక్కడికి వెళ్లి స్కూల్ పై దాడికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Related posts

Leave a Comment