తన ఇంట్లో చుట్టాలు, స్నేహితులతో కలసి ఉన్నటే ఉంది: సమంత

మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాలను తాకనున్న బ్రహ్మోత్సవం చిత్రాన్ని గురించి హీరోయిన్ సమంత పలు కబుర్లు చెప్పింది. ఈ సినిమాలో తానసలు నటించలేదని, తన ఇంట్లో చుట్టాలు, స్నేహితులతో కలసి ఉంటే ఎలా ఉంటానో అలాగే కనిపించానని చెప్పింది. ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ఎంతో మంది కష్టపడ్డారని, ఇది మహేష్ బాబు అభిమానులతో పాటు ప్రతి ఒక్కరికీ నచ్చే చిత్రమని పేర్కొంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ టీవీ చానల్ తో ముచ్చటించిన ఆమె, సినిమాలో కాజోల్, ప్రణీతలతో కలిసి నటించింది తక్కువే అయినా, వారిద్దరూ తనకు మంచి స్నేహితులని, ఫ్రేమ్ కు అందం తేవడంలో వారు ముందుండారని వెల్లడించింది. సినిమా చూసిన తరువాత ప్రతి ఒక్కరికీ తమ తమ కుటుంబం, చుట్టాలతో కలిసి కొన్ని రోజులు ఉండాలని కోరుకుంటారని తెలిపింది.

Related posts

Leave a Comment