ఏపీ ఐసెట్‌ కోడ్‌ విడుదల చేసిన మంత్రి గంటా శ్రీనివాసరావు

విశాఖ: రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్‌-2016 పరీక్ష సెట్‌ కోడ్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలో విడుదల చేశారు. ఆంధ్రా యూనివర్శిటీ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలోని వైవీఎస్‌ మూర్తి ఆడిటోరియంలో ఈ సెట్‌ కోడ్‌ విడుదల చేశారు. ఈ ఏడాది VTST(Green) సెట్‌కోడ్‌గా నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా 17 ప్రాంతీయ కేంద్రాల పరిధిలో 138 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. పరీక్ష ఫలితాలను ఈనెల 27వ తేదీన విడుదల చేస్తామన్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న పరీక్షకు 9.30 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతిస్తామన్నారు. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన లోనికి అనుమతించేది లేదని స్పష్టం చేశారు.

Related posts

Leave a Comment